తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (TS Police Jobs) సంబంధించిన నోటిఫికేషన్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు 17 వేలకు పైగా ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2 న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. పోలీస్ జాబ్స్ కు సంబంధించి వయో పరిమితి విషయంలో నిరుద్యోగుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. ఇప్పటికే వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచింది తెలంగాణ సర్కార్. అయితే కనీసం ఐదేళ్లయినా పెంచాలని అనేక మంది నిరుద్యోగులకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందు కోసం ఆందోళనలు సైతం చేస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఈ రోజు ట్విట్టర్ లో #AskKTR నిర్వహించారు. పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేధికగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు 90 నిమిషాల పాటు సాగింది. ఓ నెటిజన్ పోలీస్ ఉద్యోగాల్లో వయో పరిమితి పెంపు విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహించే మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో వయోపరిమితి కారణంగా దరఖాస్తు అవకాశం కోల్పోతున్న నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే హోం మంత్రి మహమూద్ అలీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే రెండూ, మూడు రోజులు ఆగాల్సిందే.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.