Home /News /jobs /

TELANGANA POLICE JOBS HYDERABAD CP CV ANAND KEY INSTRUCTIONS TO POLICE JOBS ASPIRANTS NS

TS Police Jobs: అలా చదివితే పోలీస్ జాబ్ గ్యారెంటీ.. అభ్యర్థులకు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచన.. వివరాలివే

మాట్లాడుతున్న సీవీ ఆనంద్

మాట్లాడుతున్న సీవీ ఆనంద్

సమయపాలన పాటిస్తూ చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం సాధించవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు నియామక పరీక్ష కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
    సమయపాలన పాటిస్తూ చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం (Police Jobs) సాధించవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ (Hyderabad CP Anand) అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ శాఖ (Hyderabad Police) ఆధ్వర్యంలో పోలీసు నియామక పరీక్ష కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సమయపాలన పాటిస్తూ చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం సాధించగలదని అభ్యర్థులకు సూచించారు. సీఎం కేసీఆర్ 80 వేల పోస్టులను పోస్టులు ప్రకటించాన్నారు. పోలీస్ శాఖలో 18 వేలు జాబ్స్ ఉన్నాయన్నారు. 2500 పోస్టులు ఉన్నాయని తెలిపారు. సినిమాలు చూసి ఇంప్రెస్ అయి పోలీస్ కావాలని అనుకోవద్దు. పోలీసులు చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.

    పోలీసు ఉద్యోగం బాధ్యతాయుతమైనదన్నారు. అభ్యర్థులకు సందేశము ఇచ్చారు. పోటీ పరీక్షలు అంటేనే పోటీతత్వం అధికంగా ఉంటుందన్నారు. దానికి అనుగుణంగా మీరు సిద్ధం కావాలని కోరారు. నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    TS Police Jobs Alert: పోలీస్ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి అన్న బోర్డు.. తెలుసుకోండి

    ఇదిలా ఉంటే.. పోలీస్ జాబ్స్ కు (Police Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిత్యం యోగా, వాకింగ్, రన్నింగ్ తప్పకుండా చేయాలని అంతర్జాతీయ యోగా ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ వెంకట రాజయ్య సూచించారు. సిద్దిపేటలో (Siddipet) పోలీస్ నియామకాలకు గురించి బీజేఆర్ భవన్ లో నిర్వహిస్తున్న పోలీస్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగాసనాలు(Yoga), ప్రాణాయామం, అనులోమ, విలోమ మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో పాటు మెదడుకు మేతనిచ్చే మనసు ప్రశాంతంగా ఉంచే యోగాసనాల గురించి వివరించారు. అభ్యర్థులతో వాటిని ప్రాక్టికల్ గా చేయించారు.
    Telangana Police Jobs: పోలీస్ జాబ్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే జైలుకు.. బోర్డ్ హెచ్చరిక

    ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకట్రామయ్య మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు, పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదవి ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, వాకింగ్, రన్నింగ్, తప్పకుండా చేయాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యం అని వివరించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad police, Job notification, JOBS, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు