Home /News /jobs /

TELANGANA POLICE JOBS HERE IS THE PREPARATION TIPS FOR SI JOBS ASPIRANTS HERE DETAILS NS KNR

TS SI Jobs Tips: తెలంగాణ ఎస్ఐ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్.. ఈ టిప్స్ మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే నెలలో సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించి వారికి మాత్రమే ఈవెంట్స్, రాత పరీక్షకు అర్హత ఉంటుంది. అయితే..

  రచయిత: పులి భరత్, కేఎన్ఆర్ ఇనిస్టిట్యూట్ ఫ్యాకల్టీ
  (P.Srinivas,New18,Karimnagar)
  వచ్చే నెలలో సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు (TS SI Jobs) సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించి వారికి మాత్రమే ఈవెంట్స్, రాత పరీక్షకు అర్హత ఉంటుంది. అయితే ఈసారి ఎస్ఐ ఉద్యోగాలకు దాదాపు 5లక్షల మంది అప్లై చేసుకున్నట్లు తెలంగాణ స్టేటల్ లెవల్ పోలీస్ రిక్రూమెంట్ బోర్డు (TSLPRB)  తెలిపింది. గతంతో కంటే .. ప్రస్తుత నోటిఫికేషన్ (Police Jobs Notification) లో చాలా మార్పులు చేశారు. దానికి అనుగుణంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్ఐ ఉద్యోగ కల నెరవేరాలంటే ఏం చేయాలి? అనే విషయాలపై కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫ్యాకల్టీ పులి భారత్ సార్ అభ్యర్థులకు పలు సూచనలు , సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

  చాలా మంది ఎస్ఐ అప్లై చేసుకున్న అభ్యర్థులు మేము కోచింగ్ తీసుకున్నాం.. గ్యారంటీ జాబ్ మాదే అనుకుంటారు. కానీ అక్కడే పప్పులో కాలేసినట్లు అవుతుంది. దరఖాస్తు చేసినంత ఈజీగా జాబ్ రాదు. ఎంత ప్రిపరేషన్ అవుతే అంత మంచిది అని భారత్ సార్ అంటున్నారు. ముందుగా ఎస్ఐ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఏ విధంగా చదవాలి? టైం టేబుల్ ఎలా రాసుకోవాలి? ఎక్కువగా మార్కులు వచ్చే సబ్జెక్టు ఏంటి? ముఖ్యంగా ఎగ్జామ్ ఏ విధానంలో ఉండబోతుంది? అనేది ముందు తెలుసుకోవాలన్నారు. చాలా మంది విద్యార్థులు వివిధ రకాలుగా ఎస్ఐ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రిపరేషన్ అవుతున్నారు. తక్కువ రోజుల్లో ఎక్కువగా చదవాలంటే  ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త చదవలిసిన అవసరం ఎంతగానో ఉంది.
  TS Police Jobs: కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి అలర్ట్.. ఇలా చదివితే జాబ్ పక్కా.. తెలుసుకోండి

  ఇప్పుడు ప్రతీ సబ్జెక్టుకు రెండు రోజులు కేటాయించి.. రివైస్డ్ చేసుకోవాలి తప్పా బుక్స్ తో కుస్తీలు పట్టకూడదు. ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ను తీసుకొచ్చారు. దీంతో ప్రతీ 5 ప్రశ్నలను తప్పుగా గుర్తిస్తే.. ఒక మార్కును కట్ చేస్తారు. కాబట్టి ప్రతీ విద్యార్థి కూడా నెగిటివ్ మార్కింగ్ ను దృష్టిలో పెట్టుకొని చదవాలి. గతంలో నెగిటివ్ మార్కింగ్ అనేది సెంట్రల్ జాబ్స్ లో  ఉండేది. ఈసారి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావాలంటే 60 మార్కులు రావాలి. అది ఎవరైనా కావచ్చు 60 మార్కులు వస్తేనే మనం ప్రిలిమ్లో క్వాలిఫై అయినట్లు.

  సబ్జెక్ట్ వైస్ గా ప్రిలిమ్స్ లో ఎన్ని మార్కులు ఉన్నాయో చూద్దాం.. అర్థమెటిక్ రిజనింగ్ కలిపి 100 మార్కులు ఉంటాయి. మిగతా 100 మార్కులకు జీఎస్ అంటే జనరల్ స్టడీస్  ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయోలజీ, సైన్స్, సోషల్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సిలబస్ ను చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్.. రీజనింగ్ కి 100 మార్కులు ఉంటాయి. మిగతా జనరల్ స్టడీస్ కు 100 మార్కులు ఉన్నాయి. మనకి ఈ రెండు వందలకు  60 మార్కులు వస్తే మనము ప్రిలిమ్స్ లో క్వాలిఫై ఐనట్లు. లేకపోతే అభ్యర్థులు ఆ ప్రయత్నం ను విరమించుకోవాల్సిందే.

  ముందుగా ఎగ్జామ్స్ సెంటర్ లోకి వెళ్ళగానే ప్రశ్నపత్రం ఇవ్వగానే ఒకటికి రెండు సార్లు  ప్రశ్న పత్రాన్ని చదవాలి. చదివిన తర్వాత ఫస్ట్ వన్ హౌర్ లో లోనే తెలిసిన వాటన్నింటికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్లాలి. తెలియని ప్రశ్నలకు వదిలి పెట్టాలి. తెలియని వాటిని అసలే ముట్టుకోవద్దు. మరో వన్ హవర్ లో కొంచెం తెలిసిన వాటిని గుర్తించి ఆన్సర్ చేయాలి. నెగటివ్ మార్కింగ్ అనేది చాలా డేంజర్. అందుకే పక్కా కరెక్ట్ అని అనుకున్న ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గర్తించాల్సి ఉంటుంది .లాస్ట్ హవర్ తెలియని వాటిని గుర్తు తెచ్చుకొని రాస్తే ఇజీగా టైం సరిపోతుంది. అలా టైం మెయింటైన్ చేస్తే అనుకున్న వాటికంటే ఎక్కువగా స్కోరు చేయవచ్చు అంటున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, Police jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు