(రచయిత: నగేష్ M.Sc, B.Ed)
(P Mahender, News 18, Nizamabad)
కానిస్టేబుల్ జాబ్స్ కు (Telangana Constable Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనే విషయాలపై దృష్టి పెట్టాలని ఐ 5 కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ నగేష్ సూచిస్తున్నారు. అర్థమెటిక్ (arithmetic) కు సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ (Police Jobs Preparation Tips) ను ఆయన వివరించారు. అర్థమెటిక్ నుంచి 25 మార్కులు అడగడానికి అవకాశం ఉందన్నారు. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఆ 25 మార్కులకు గాను.. మనము 25 సాధించవచ్చన్నారు. ప్రతీ చాప్టర్ ను పక్కాగా ప్రాక్టీస్ చేయాలన్నారు. ఉదాహరణకు రేషియో అండ్ ప్రపోజిషన్ టాపిక్ తీసుకున్నట్లయితే ఆ రేషియో అండ్ ప్రపోజిషన్ లో అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ఏమున్నాయి? లాంటివి తెలుసుకోవాలన్నారు. అలా చదివితే.. ప్రశ్న ఏదైనా సరే దానిని అవలీలగా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కానిస్టేబుల్ సిలబస్ కు సంబంధించి మొత్తం 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్ లో ప్రీవియస్ పేపర్స్ ని ఏవిధంగా అడిగారు? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? లాంటి అంశాలపై ఫోకస్ చేయాలి. ఎవరైతే మోడల్ పేపర్స్ ఎక్కువగా రాస్తారో వాళ్లు స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందన్నారు.
అలా చేసిన వారికి నెగటీవ్ మర్కులు కూడా రాకుండా ఉంటుందన్నారు. ప్రతీ తప్పు సమాధానికి 1/5 నెగటివ్ మార్కు ఉంటుందన్నారు. అంటే ఐదు ప్రశ్నలకు తప్పుగా సమాధానం చేస్తే ఒక మార్కు పోతుందన్నమాట. మాథ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే నెగటివ్ మార్కులతో నష్టపోకుండా 25కు 25 మార్కులు సాధించవచ్చు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కు సంబంధించి మొత్తం 200 మార్కులుంటాయి.. ఆ రెండు వందల మార్కుల్లో 25 మార్కులు అర్థమెటిక్ కు ఉన్నాయి. రీజనింగ్ 25 మార్కులు ఉంటాయి.
TS Police Jobs: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తారా? తాజా అప్డేట్స్ ఇవే..
ఇంగ్లిష్ కు 20 మార్కులు ఇచ్చారు. అదే విధంగా సైన్స్ కి 25 మార్కులు ఇచ్చారు. ఇండియన్ హిస్టరీ 20 మార్క్స్ జాగ్రఫీ కి 15 మార్కులు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కు 20 మార్కులు ఇస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రిమైనింగ్ పార్ట్స్ స్కోరింగ్ ఈజీగా 60 మార్కులు సాధించవచ్చు. ఎగ్జామ్ కు 25 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కనీసం 15 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం బెటర్. ఆ మోడల్ పేపర్స్ లో మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము? ఎంతవరకు స్కోరింగ్ వస్తుంది? అనే విషయాన్ని గమనించాలి. ఇలా ప్రిపేర్ అయితే మనకు 60 మార్కులు ఈజీగా సంపాధించి క్వాలిఫై అవుతామని వివరించారు.
అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Police jobs, Telangana government jobs, Telangana police jobs