Home /News /jobs /

TELANGANA POLICE JOBS HERE IS THE IMPORTANT TIPS FOR SI AND CONSTABLE JOB ASPIRANTS NS

TS SI Preparation Tips: ఎస్సై, కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ మూడవసారి విడుదలైంది. గత రెండు సార్లు సాధారణంగానే పరీక్షలు నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ సారి మాత్రం నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చింది.

    సేకరణ: శివాజీ, జాగ్రఫీ  ఉపాధ్యాయుడు, పాలమూరు కోచింగ్ సెంటర్, మహబూబ్ నగర్
    (Syed Rafi, News18,Mahabubnagar)

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) నోటిఫికేషన్ మూడవసారి విడుదలైంది. గత రెండు సార్లు సాధారణంగానే పరీక్షలు నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఈ సారి మాత్రం నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రశ్న పత్రాలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 60 మార్కులు సాధించడానికి మంచి ప్రణాళికతో జవాబులు ఇచ్చేలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు 60 మార్కులు సాధిస్తేనే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. దాంతో పాటు ప్రిలిమ్స్ చాలా ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువగా హార్డ్ సబ్జెక్టు లైనా మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ తోపాటు ప్యూర్ మాస్ చదవడంతో మంచి మార్కులు  సాధించవచ్చు. అవి కాకుండా ముఖ్యంగా జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం చాలా మంచిది. అందులో హిస్టరీ అనేది సోషల్ పార్ట్ గా మేజర్ గా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చాలా ఎక్కువ అంశాలు ప్రాధాన్యత తీసుకుని ప్రశ్నలు ఉంటాయి.

    కాబట్టి వీటిపై 40 మార్కులు సాధించే అవకాశం ఉంటుందని అందుకు హిస్టరీ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే బాగుంటుంది. మ్యాథ్స్ తో పాటు హిస్టరీ చాలా అవసరం దానితోపాటు జియోగ్రఫీ పై 15 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రఫీ అనగానే చాలా మంది అభ్యర్థులు భయాందోళనకు గురవుతారు. కానీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీతో పాటు ఈసారి ప్రిన్సిపాల్ జాగ్రఫీ అనే కొంత పార్టు ఉంటుంది. యూనివర్సల్ జాగ్రఫీలో ఉదాహరణకు భూమి యొక్క నిర్మాణం, సముద్ర శాస్త్రం గురించి ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. అంతే కాకుండా.. మనకున్న వాటిలో ఐదు మహాసముద్రాలు వాటి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
    TSPSC Group 1 Coaching: గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త.. ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. దరఖాస్తు ఇలా

    వీటితోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనవి. పరీక్ష పత్రంలో ఇవి కీ రోల్ గా ఉంటాయి. ముఖ్యంగా దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు వివిధ కార్యక్రమాల గురించి బాగా అడుగుతారు కాబట్టి వాటిలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు ఇంతసేపు మ్యాథమెటిక్స్ సైన్స్ హార్డ్ సబ్జెక్టులుగా అనుకొని వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్ పై ఫోకస్ చేయడం వల్ల మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈసారి పరీక్ష పత్రంలో నెగిటివ్ మార్కింగ్ పెట్టారు.


    కాబట్టి చాలా జాగ్రత్తగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో తప్పుగా సమాధానం ఇచ్చినట్లయితే మనకు వచ్చిన మార్కుల్లో కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు కరెక్ట్ జవాబులు మాత్రమే ఇవ్వండి. ఒకవేళ తెలవని పక్షంలో ఆ ప్రశ్నలు వదిలేయడం ఉత్తమం. అంతేకానీ ప్రశ్న పత్రంలో ముందుగా వచ్చిన వాటిల్లో జవాబులు ఇచ్చి రాని వాటిని ఆలోచించి కరెక్ట్ గా సమాధానం ఇవ్వడం మంచిది. ఒకవేళ సమాధానం తెలువక పోతే సమాధానం ఇవ్వకుండా వదిలివేయడం కరెక్ట్. లేని పక్షంలో నెగటీవ్ మార్కుల విధానంతో మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Police jobs, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు