పోలీస్ జాబ్స్ కు (Police Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిత్యం యోగా, వాకింగ్, రన్నింగ్ తప్పకుండా చేయాలని అంతర్జాతీయ యోగా ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ వెంకట రాజయ్య సూచించారు. సిద్దిపేటలో (Siddipet) పోలీస్ నియామకాలకు గురించి బీజేఆర్ భవన్ లో నిర్వహిస్తున్న పోలీస్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగాసనాలు(Yoga), ప్రాణాయామం, అనులోమ, విలోమ మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో పాటు మెదడుకు మేతనిచ్చే మనసు ప్రశాంతంగా ఉంచే యోగాసనాల గురించి వివరించారు. అభ్యర్థులతో వాటిని ప్రాక్టికల్ గా చేయించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకట్రామయ్య మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు, పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదవి ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, వాకింగ్, రన్నింగ్, తప్పకుండా చేయాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యం అని వివరించారు.
యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని, మెదడు చురుకుగా పని చేస్తుందన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని వివరించారు. మంచి క్రమశిక్షణతో ఉంటూ పైకి రావాలని సూచించారు. ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని సూచించారు. శాంతంగా ఉన్న వారే జీవితంలో ఏదైనా సాధించగలరన్నారు. జీవితంలో ధనము కోల్పోతే కొంత కూలిపోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అని వివరించారు. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి అదే అన్నారు. వినయంలేని విద్య గుణములేని రూపము నిరుపయోగమన్నారు.
ప్రపంచంలో పాపమనేది ఉంటే అది మన బలహీనత మాత్రమే అని అన్నారు. మరియు మానసికంగా మనం బలహీనులైన వారే తప్పులు చేస్తారన్నారు. ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్లే వచ్చినట్లే అని గ్రహించాలన్నారు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారన్నారు. ఒక్క క్షణం ప్రమాదాన్ని ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుందని హెచ్చరించారు.
ఓటమి లేని జీవితం ఉండదు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ మాట్లాడుతూ.. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించాలన్నారు. ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, క్రమం తప్పకుండా క్లాసులకు రావాలని ప్రతిరోజూ ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ కూడా రావాలని అభ్యర్థులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, Jobs in telangana, Telangana government jobs, Telangana police jobs