Home /News /jobs /

TELANGANA POLICE JOBS GOOD NEWS FOR THE UNEMPLOYED FREE PRE RECRUITMENT TRAINING IN HYDERABAD GH EVK

Telangana Police Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఫ్రీగా హైదరాబాద్‌లో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Police Jobs | తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్న అభ్యర్థులందరూ తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారికి హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) గుడ్‌న్యూస్ చెప్పారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ (Telangana) ప్రభుత్వం భారీ ఉద్యోగ ప్రకటనకు సిద్ధమైంది. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్న అభ్యర్థులందరూ తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారికి హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) గుడ్‌న్యూస్ చెప్పారు. కమ్యూనిటీ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ (Community outreach program)లో భాగంగా త్వరలో హైదరాబాద్‌లో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (PRT)ని ప్రారంభించనున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ తాజాగా ప్రకటించింది. పోలీసు శాఖలో సేవలు అందించాలని తపనపడేవారికి ఫ్రీగా సమగ్ర ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామని సిటీ పోలీస్ ప్రకటించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ISRO Jobs: ఇస్రో-ఐఐఆర్ఎస్‌లో జాబ్స్‌.. వేత‌నం రూ. 56,100.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్నా సరైన గైడెన్స్ లేక చాలా మంది ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. ఇలాంటి అభ్యర్థులకు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగర పోలీసు అధికారులు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. రాత పరీక్ష (Written Test), దేహదారుఢ్య పరీక్ష (Physical Test)లలో ఉత్తీర్ణత సాధించేలా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు సిటీ పోలీసులు ట్రైనింగ్ ఇస్తున్నారు.

స్పెషల్ గైడెన్స్, ట్రైనింగ్
"చాలా మంది యువకులు పోలీసు బలగాలలో చేరాలని కలలుకంటున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇనిషియల్ రిక్రూట్‌మెంట్ టెస్టులు క్లియర్ చేయలేకపోతున్నారు. అందుకే స్పెషల్ పీఆర్టీ (Pre-recruitment training) లాంచ్ చేశాం. ఇది అకడమిక్, ఫిజికల్ ట్రైనింగ్స్.. రెండూ అంశాలను కవర్ చేస్తుంది." అని ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు.

Govt Jobs 2022: సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జాబ్స్‌.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌, అర్హ‌త‌లు!

ఈ ట్రైనింగ్ లో అకడమిక్ క్లాసులను ఎక్స్‌పీరియన్స్‌ ఫ్యాకల్టీ కండక్ట్ చేస్తుంది. ఈ క్లాసుల ద్వారా విద్యార్థులు తమ నాలెడ్జ్ కు పదును పెట్టుకోవచ్చు. ఈ క్లాసుల ద్వారా విలువైన నాలెడ్జ్ సంపాదించి రాత పరీక్షల్లో రాణించొచ్చు. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ అనేది అభ్యర్థుల చురుకుదనం, ఓర్పును పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. ఇది ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేయడంలో అభ్యర్థులకు సహాయపడుతుంది.

Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

ఐదు జోన్లలో ట్రైనింగ్
హైదరాబాద్ నగరంలోని మొత్తం ఐదు జోన్లలోని వివిధ కేంద్రాల్లో ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ నిర్వహించనున్నామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉచిత PRT కి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాచ్ టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లింక్ form.jotform.com/220792437998473 పై క్లిక్ చేయాలి.
Published by:Sharath Chandra
First published:

Tags: Hyderabad police, Telangana, Telangana police jobs, Ts jobs

తదుపరి వార్తలు