Home /News /jobs /

TELANGANA POLICE JOBS DISTRICT WISE SI AND CONSTABLE VACANCIES LIST EVK

TS Police Jobs: ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు.. జిల్లాల వారీగా ఎస్సై.. కానిస్టేబుల్ ఖాళీల వివ‌రాలు

Telangana SI Jobs: తెలంగాణలో 587 ఎస్‌ఐ పోస్టులు... విద్యార్హతలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana SI Jobs: తెలంగాణలో 587 ఎస్‌ఐ పోస్టులు... విద్యార్హతలివే (ప్రతీకాత్మక చిత్రం)

District Wise Police Job Vacancy List | తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో ఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాల వారీగా  ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల వివరాలు..

ఇంకా చదవండి ...
    తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ జాబ్ కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతున్నారు. వారికి ఊరటనిస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.

    జిల్లాల వారీగా  ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల వివరాలు..



















































































































    జిల్లాఖాళీలు
    ఆసిఫాబాద్‌-కొమురం భీం182
    భూపాల‌ప‌ల్లి-జ‌య‌శంక‌ర్‌64
    ములుగు68
    రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌441
    ఆదిలాబాద్‌234
    జ‌గిత్యాల‌123
    నిర్మ‌ల్‌158
    నిజామాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌400
    కామారెడ్డి240
    క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌413
    మెద‌క్‌179
    సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌రేట్‌222
    కొత్త‌గూడెం-భ‌ద్రాద్రి142
    మ‌హ‌బూబాబాద్‌190
    వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌850
    న‌ల్గొండ‌464
    రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్‌850
    సూర్యాపేట320
    సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌451
    హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌1,918
    సంగారెడ్డి545
    వికారాబాద్‌107
    గ‌ద్వాల్ - జోగులాంబ‌118
    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌201
    నాగ‌ర్‌ క‌ర్నూల్‌195
    నారాయ‌ణ‌పేట‌100
    వ‌న‌ప‌ర్తి131

    ఎస్సై పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. 2022 జూలై 1 లోగా పరీక్ష పాసై ఉండాలి.

    34వ నెంబర్ పోస్టుకు పదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. దీంతో పాటు ఎలక్ట్రానిక్, మెకానిక్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటనెన్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

    35వ నెంబర్ పోస్టుకు పదవ తరగతితో పాటు వైర్‌మెన్ లేదా మెకానిక్ మోటార్ వెహికిల్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ పాస్ కావాలి.

    36వ నెంబర్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. లేదా పదవ తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ మోటార్ వెహికిల్ మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్‌లో ఐటీఐ పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్ లేదా హెచ్ఎంవీ లైసెన్స్ ఉండాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS, Telangana government jobs, Ts jobs

    తదుపరి వార్తలు