TELANGANA PEDDAPALLI DMHO RELEASED JOBS NOTIFICATIONS FOR VACANCIES IN NATIONAL HEALTH MISSION HERE FULL DETAILS NS
Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పలు మెడికల్ ఉద్యోగాల భర్తీని చేపట్టారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. నేషనల్ హెల్త్ మిషన్(NHM)లో పలు ప్రోగ్రాముల నిర్వహణకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పలు మెడికల్ ఉద్యోగాల భర్తీని చేపట్టారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. నేషనల్ హెల్త్ మిషన్(NHM)లో పలు ప్రోగ్రాముల నిర్వహణకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సైకియాట్రిస్ట్ విభాగంలో 1, ఫిజీషియన్/మెడికల్ ఆఫీసర్ విభాగంలో 1, స్టాఫ్ నర్సు విభాగంలో మరో ఐదు ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సైకియాట్రిస్ట్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్న విద్యార్థులు సంబంధిత విభాగంలో ఎండీ చేసి ఉండాలి. ఫిజీషియన్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే విద్యార్థులు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. నర్సు ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు బీఎస్సీ/ఎంఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్ పాటించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 19లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. వైబ్ సైట్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లను నింపి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని ప్రకటనలో స్పష్టం చేశారు. Notification-Direct Link Application Form-Direct Link Official Website-Direct Link
అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందంటే..
అభ్యర్థులు వారి విద్యార్హత పరీక్షల్లో సాధించన మార్కులకు 80 శాతం, అనుభవం, ఇంటర్వ్యూకు మరో 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఈ రెండు మార్కులను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికను నిర్వహించనున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.