Job Notification: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2 రోజులే గడువు

Job Notification: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Job Notification | పలు సంస్థలు ఇటీవల రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్స్‌కు అప్లై చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఆ సంస్థలు జారీ చేసిన నోటిఫికేషన్లు, ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇటీవల పలు సంస్థలు వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) రిలీజ్ చేస్తున్నాయి. ఆ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ దగ్గరకు వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఐదు జాబ్ నోటిఫికేషన్స్‌కు అప్లై చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువుంది. నిరుద్యోగులు ఈ రెండు రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited), తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, లోక్‌సభ సచివాలయం, ఇండియన్ నేవీ లాంటి సంస్థలు జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

    IRCTC Recruitment 2021: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 150 కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. న్యూ ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ పోస్టులు ఉన్నాయి. 2021 అక్టోబర్ 10 లోగా అప్లై చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

    Oil India Recruitment 2021: ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) 535 గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ, గ్రేడ్ సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2021 అక్టోబర్ 10 లోగా దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Telangana JPS Recruitment 2021: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 172 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్

    Lok Sabha Recruitment 2021: లోక్‌సభ సచివాలయం కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, జూనియర్ కంటెంట్ రైటర్, జూనియర్ అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ నావల్ అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్స్ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2021 అక్టోబర్ 10 లోగా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published: