TELANGANA OSMANIA UNIVERSITY WARNING TO HOSTEL STUDENTS NS
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్
ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్
డిసెంబర్ 27 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలో అన్ని కోర్సులకు సంబంధించి తరగతులు (Classes) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) తాజాగా కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 27 నుంచి యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న అన్ని కోర్సులకు సంబంధించి సెమిస్టర్ తరగతులు (Classes) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో ఉంటున్న అనధికార వ్యక్తులంతా డిసెంబర్ 24వ తేదీలోగా ఖాళీల చేయాలని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. హాస్టళ్లలో అవాంఛనీయ సంఘటనలు మరియు అసౌకర్యాలను నియంత్రించడానికి అనధికార వ్యక్తులను హాస్టళ్ల (Hostels) నుండి ఖాళీ చేయించాలని బోనఫైడ్ విద్యార్థులు (Students) విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ చేయని వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తామని, యూనివర్సిటీ ఆవరణలోకి చొరబడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో గదులను ఆక్రమించిన అనధికార వ్యక్తులు బయటకు వెళ్లడం వల్ల యూనివర్సిటీ హాస్టళ్లలో అడ్మిషన్ కోరుకునే క్యాంపస్ మరియు కళాశాలల బోనఫైడ్ విద్యార్థుల ప్రవేశం సులభతరం అవుతుందని అధికారులు ప్రకటనలతో తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూను నిర్వహించి తద్వారా ఎంపిక చేపట్టనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేపట్టేవారు. అయితే ప్రస్తుతం ఓయూలో నూతనంగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. GATE 2022: గేట్ 2022 పరీక్ష షెడ్యూల్ విడుదల.. జనవరి 3న అడ్మిట్‌కార్డులు రిలీజ్, ఫిబ్రవరిలో ఎగ్జామ్
ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తుండడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దినిపై ఒక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోన్నట్ల ప్రభుత్వ వర్గాల సమాచారం. గతంలో ఇంటర్ ఫలితాలు విడుదలైనప్పుడు ఎటువంటి రచ్చ జరిగిదో ఇప్పుడు అదే స్థాయిలో జరగకుండా సమస్యకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.