Jobs in Telangana: తెలంగాణలోని ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి.. ఎల్లుండి వరకే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ(Telangana)లోని రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా(Corona) నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇటీవల వైద్య సిబ్బంది (Health Staff) నియామకాలు (Recruitments) జోరుగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో స్టాఫ్ నర్సు (Staff Nurse) ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 6 స్టాఫ్ నర్సు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ నెల 23న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Job Application) చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని డీఎంహెచ్ఓ, రంగారెడ్డి చిరునామాకు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.















    పోస్టు ఖాళీలు విద్యార్హత వేతనం
    స్టాఫ్ నర్సు 6 బీఎస్సీ నర్సింగ్ రూ.23 వేలు

    అనుభవం: అభ్యర్థులు యాక్టీవ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
    వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
    Jobs in Telangana: తెలంగాణలోని ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఇలా అప్లై చేసుకోండి

    అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
    -మొదట అప్లికేషన్ ఫామ్ (Application Form) ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
    -అప్లికేషన్ ఫామ్ కు సెల్ఫ్ అటెస్ట్ చేసిన updated Resume, విద్యార్హత ధ్రువపత్రాలు. ఆక్టీవ్ నర్సిగ్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ జతచేయాలి.
    -అప్లికేషన్ ఫామ్ పై సూచించిన చోట ఫోటోను అంటించాలి. ఇంకా సంతకం చేయాలి.
    Jobs In ESIC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐసీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..

    -ఓసీ, బీసీ అభ్యర్థులు డీఎంహెచ్ఓ పేరిట రూ. 200 డిమాండ్ డ్రాఫ్ట్ ను తీసి అప్లికేషన్ ఫామ్ కు జత చేయాల్సి ఉంటుంది.
    -జత చేయాల్సిన ఇతర ధ్రువపత్రాలు, పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
    -అప్లికేషన్ ఫామ్ ను ఈ నెల 28వ తేదీలోగా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నియర్ పిల్లర్ నంబర్ 294, శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, పిన్ కోడ్ 500052 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: