Telangana: ఆ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం(Kaloji Narayana Rao University of Health Sciences, KNRUHS) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు యునివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: December 1, 2020, 2:20 PM IST
Telangana: ఆ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు యునివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్(MBBS, BDS) కోర్సుల్లో ప్రవేశాలను నిర్వహించనున్నారు. నీట్‌ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని యూనివర్సిటీ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1(ఈ రోజు) ఉదయం 8 గంటల నుంచి 7 వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మరింత సమాచారారం కోసం www .knruhs.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
Published by: Nikhil Kumar S
First published: December 1, 2020, 2:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading