TELANGANA NOTIFICATION RELEASED FOR INTER ADMISSIONS IN MODEL SCHOOLS HERE APPLICATION LINK NS
Telangana Students: తెలంగాణలో టెన్త్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 5 రోజులే ఛాన్స్..
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడుతున్న మోడల్ స్కూళ్లలో (TS Model Schools) ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలతో పాటు మోడల్ స్కూల్స్ (TS Model Schools) సైతం సక్సెస్ అయ్యాయి. అక్కడ మంచి నాణ్యమైన విద్య అందుతుండడంతో చేరేందుకు భారీగా విద్యార్థులు (Students) పోటీ పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 194 మోడల్ స్కూళ్లలో నిర్వహిస్తున్న నాలుగు కోర్సుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఈ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ స్టెప్స్ తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Step 1:అభ్యర్థులు మొదటగా మోడల్ స్కూల్స్ అధికారిక వెబ్ సైట్ https://www.tsmodelschools.com/ ను ఓపెన్ చేయాలి. Step 2:హోం పేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3:కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో పేరు, ఇంటి పేరు, తల్లిపేరు, తండ్రి పేరు, టెన్త్ హాల్ టికెట్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అప్ లోడ్ చేయాలి. Step 4:అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.