Home /News /jobs /

TELANGANA NOTIFICATION RELEASED FOR ANGANWADI JOBS VACANCIES AT MEDAK AND SIDDIPET DISTRICTS NS

Telangana Anganwadi Jobs: తెలంగాణలోని ఆ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో అంగన్ వాడీ(Anganawadi Jobs) ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Job Notification) విడుదల చేశారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, ఇతర సమాచారం మీ కోసం..

  తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అంగన్ వాడీ ఉద్యోగాల(Anganwadi Jobs) భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు (Job Notification)విడుదల అవుతున్నాయి. అధికారులు జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాల్లో ఖాళీల భర్తీకి అధికారులు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఖాళీల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఖాళీల్లో అంగన్ వాడీ టీచర్, స్టాఫ్, ఆయా తదితర విభాగాల్లో పోస్టులు(Posts) ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని టెన్త్ పాసైన మహిళలు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. స్థానికంగా నివాసం ఉండే మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లలో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా దరఖాస్తుకు వేర్వేరుగా ఆఖరి తేదీలు ఉన్నాయి.

  మెదక్ జిల్లాలో ఖాళీలు..
  మెదక్ జిల్లాలో పలు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని మెదక్, అల్లాదుర్గ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 65 అంగన్ వాడీ స్టాఫ్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే జిల్లాలోని రామాయంపేట పరిధిలోనూ 35 ఆయా పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నర్సాపూర్ లోనూ 43 అంగన్ వాడీ స్టాఫ్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఖాళీలకు సెప్టెంబర్ 6లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  Telangana Post Office Recruitment 2021: తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో జాబ్స్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇలా అప్లై చేయండి

  సిద్దిపేట జిల్లాలో..
  సిద్దిపేట జిల్లాలోనూ పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్ వాడీ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ దుబ్బాక పరిధిలో 12, ఐసీడీఎస్ చేర్యాల్ ప్రాజెక్ట్ పరిధిలో 16 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా సిద్దిపేట ప్రాజెక్ట్ పరిధిలో 19, హుస్నాబాద్ పరిధిలో 13 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గజ్వేల్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీ సహాయకురాలు(హెల్పర్) 35 హెల్పర్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఖాళీలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  Anganwadi Jobs in AP: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

  ఖమ్మం జిల్లాలో..
  ఖమ్మం జిల్లాలోనూ పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఖమ్మం పరిధిలో 12 అంగన్ వాడీ టీచర్, ఆయాల ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెల 9లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్టు పరిధిలో 09 అంగన్ వాడీ టీచర్, ఆయాల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఈ నెల 9లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సత్తుపల్లి పరిధిలో 9 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సెప్టెబర్ 9లోగా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా పరిధిలో 19 ఆయా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సైతం ఈ నెల 9లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Anganwadi, Job notification, Telangana, Telangana government jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు