ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 135 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లు తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన మహిళలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వివాహితులైన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు స్థానికంగా గ్రామ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తూ ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థినుల వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18-35 ఏళ్లు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన ధ్రువపత్రాలు..(Scanned Copies)
-పుట్టిన తేదీ/వయస్సు ధ్రువీకరణ పత్రం
-కుల ధ్రువీకరణ పత్రం
-విద్యార్హత ధ్రువీకరణ పత్రం, టెన్త్ మార్క్స్ మెమో
-నివాస స్థల ధ్రువీకరణ పత్రం
-అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం
-వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
-అనాథ అయితే అనాథ సర్టిఫికేట్
-వికలాంగులు అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రం Official Notification - Direct Link Official Website - Direct Link
ఇతర వివరాలు..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 15 సాయంత్రం 5 గంటలోగా ఆన్లైన్లో ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://mis.tgwdcw.in/ను సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర పూర్తి వివరాలను, ఖాళీల వివరాలను పైన ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులను మొదటగా షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహించిన ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ నెల 16 నుంచి 24లోగా ఒరిజినల్ సర్టిఫికేట్లను స్క్రూటీని చేయించుకోవాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.