TELANGANA NOTIFICATION RELEASED FOR ADMISSIONS INTO BC GURUKUL DEGREE AND JUNIOR COLLEGES NS
Telangana Admissions: తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ (MJPTBCWRJC & RDC-CET-2022) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో గురుకులాలు ఎంతగా సక్సెస్ అయ్యాయన్నది తెలిసిన విషయమే. దీంతో అక్కడ అడ్మిషన్లకు కూడా విపరీమైన పోటీ ఏర్పడింది. తాజాగా గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు (MJPTBCWRJC & RDC-CET-2022) సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న 2022-23 విద్యాసంవత్సరంలో బీసీ బాలబాలికల గురుకుల కాలేజీల్లో ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించారు. డిగ్రీ కోర్సుల కోసం కేవలం బాలికలు మాత్రమే అప్లై చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అప్లై చేసుకున్న విద్యార్థులకు జూన్ 5న ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని వివరించారు. ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లో 2021-22 సంవత్సరంలో టెన్త్ పాసై ఉండాలన్నారు. డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలో 2021-22 సంవత్సరంలో ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. TS Polycet Applications: తెలంగాణ పాలిసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. దరఖాస్తుకు ఆ రోజే చివరి తేదీ..
విద్యార్థుల తల్లిదండ్రుల లేదా సంరక్షకుల సంవత్సర ఆదాయం విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/- కు మించి ఉండవద్దని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్త వివరాలకు mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఇతర ఏమైనా డౌట్స్ ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.