Home /News /jobs /

TELANGANA NIMS INVITING APPLICATIONS FOR VARIOUS JOB VACANCIES HERE FULL DETAILS NS

Jobs in Telangana: హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. ఇలా అప్లై చేయండి

హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. ఇలా అప్లై చేయండి

హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. ఇలా అప్లై చేయండి

హైదరాబాద్ లోని నిమ్స్(NIMS) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నిజాం ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) రాష్ట్రంలోనే వైద్యరంగంలో పేరొందిన సంస్థ అయిన విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్స్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో (Contract Jobs) భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
























    పోస్టు ఖాళీలు
    అసిస్టెంట్ ప్రొఫెసర్2
    డేటా ఎంట్రీ ఆపరేటర్2
    హెల్పర్స్2
    మొత్తం6

    విద్యార్హతల వివరాలు..
    అసిస్టెంట్ ప్రొఫెసర్: ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటునన అభ్యర్థులు M.D/DNB (in Radio Diagnosis) విద్యార్హత కలిగి ఉండాలి. దీంతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.30 లక్షల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Data Entry Operator: డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. దీంతో పాటు డేటా ఎంట్రీ విభాగంలో అనుభవం ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
    Helpers: ఈ ఖాళీలకు ఎలాంటి విద్యార్హతను నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఎంపికైన వారికి నెలకు రూ. 7,500 వేతనం చెల్లిచనున్నారు.
    UPSC Recruitment 2021: ఆ ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో ఐదు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    దరఖాస్తు వివరాలు..
    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులకు డిసెంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను The Dean Nizams Inistute Of Medical Sciences, Panjagutta, Hyderabad-500082, TS. చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
    దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలను ఫోన్ లేదా ఈ మెయిల్ ద్వారా పంపిస్తారు.
    ESIC Recruitment 2021: ఈఎస్ఐసీలో 1,120 ఉద్యోగాలు.. జీతం రూ.56,100.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను మొదట నిమ్స్ అధికారిక వెబ్ సైట్ (https://www.nims.edu.in/index) ఓపెన్ చేయాలి.
    Step 2: హెం పేజీలో నోటిఫికేషన్ విభాగంలో రిక్రూట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం Recruitment of Temporary Post in Tele-Radiology HU ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: అనంతరం Download ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ అవుతుంది.


    Step 5: అప్లికేషన్ ఫామ్ లో పేరు, విద్యార్హతల వివరాలు, అనుభవం, మొబైల్ నంబర్, ఈ మెయిల్ తదితర వివరాలను నమోదు చేయాలి.
    Step 6: అనంతరం కావాల్సిన విద్యార్హతల సర్టిఫికేట్లను అప్లికేషన్ ఫామ్ కు జత చేయాలి.
    Step 7: అప్లికేషన్ ఫామ్ ను పైన పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, State Government Jobs, Telangana government jobs, Telangana jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు