హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022 : స్టేట్ కోటా కింద తెలంగాణ నీట్ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

NEET 2022 : స్టేట్ కోటా కింద తెలంగాణ నీట్ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022 : అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ tsmedadm.tsche.in‌ ఓపెన్ చేసి, వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నీట్-2022 ఫలితాల(NEET 2022 Results) ఆధారంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం స్టేట్ కోటా కింద కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందులో భాగంగా తెలంగాణ (Telangana)లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) తాజాగా నీట్ కౌన్సెలింగ్- 2022 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో MBBS, BDS కోర్సుల్లో ప్రవేశానికి అధికారిక వెబ్‌సైట్ tsmedadm.tsche.in ద్వారా అక్టోబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

* కౌన్సెలింగ్ అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ యూజీ-2022కు అవసరమైన కట్ ఆఫ్ పర్సంటైల్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు 50 పర్సంటైల్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు- 45 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 పర్సంటైల్ స్కోర్ సాధించి ఉండాలి. కౌన్సెలింగ్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు.. 2022 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) లేదా బయో టెక్నాలజీ, ఇంగ్లీషుతో కూడిన ఇంటర్‌కు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

* కౌన్సెలింగ్‌‌కు సీట్ బుక్ చేసుకొనే విధానం

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ tsmedadm.tsche.in‌ ఓపెన్ చేసి, వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. చివరకు, భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* అవసరమైన డాక్యుమెంట్లు

నీట్-2022 కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు కొన్ని డాక్యుమెంట్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. నీట్ ర్యాంక్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ (SSC మార్కుల మెమో), క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ (ఇంటర్మీడియట్ మార్కుల మెమో లేదా అందుకు సమానమైనది. గ్రేడ్ సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు.), 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్(వర్తిస్తే), ఆధార్ కార్డు, అభ్యర్థి తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, అభ్యర్థి సంతకం వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.

ఇది కూడా చదవండి :  విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రూ.2.64 కోట్ల స్కాలర్‌షిప్‌తో మేనేజ్‌మెంట్ కోర్సులు .. పూర్తి వివరాలివే!

* అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు తప్పనిసరిగా ఫీజును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు కలిపి ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3500, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ. 2900 చెల్లించాల్సి ఉంటుంది.

* నీట్ ర్యాంక్ ఆధారంగా ఫైనల్ మెరిట్ పొజిషన్‌

https://tsmedadm.tsche.in వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకోవడానికి, స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయడానికి అక్టోబర్ 11 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే సమయం కేటాయించారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ పొజిషన్‌ను నీట్ యూజీ - 2022 ర్యాంక్ ఆధారంగా, అలాగే స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఉన్న అర్హత ప్రమాణాల ఆధారంగా తయారు చేయనున్నారు. అడ్మిషన్ కమిటీ కేటాయించిన మెడికల్ కాలేజీలో అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ల ఫైనల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET 2022, Telangana

ఉత్తమ కథలు