హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Komatireddy Venkat Reddy Job Mela: ఎంపీ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి భారీ జాబ్ మేళా.. 250 కంపెనీల్లో 20 వేల జాబ్స్.. పూర్తి వివరాలివే

Komatireddy Venkat Reddy Job Mela: ఎంపీ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి భారీ జాబ్ మేళా.. 250 కంపెనీల్లో 20 వేల జాబ్స్.. పూర్తి వివరాలివే

నిరుద్యోగులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ శుభవార్త.. 250 ప్రముఖ కంపెనీల్లో 20 వేల జాబ్స్.. రేపు, ఎల్లుండి జాబ్ మేళా

నిరుద్యోగులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ శుభవార్త.. 250 ప్రముఖ కంపెనీల్లో 20 వేల జాబ్స్.. రేపు, ఎల్లుండి జాబ్ మేళా

తెలంగాణలోని నిరుద్యోగులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatreddy Venkat Reddy) భారీ శుభవార్త చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో భారీ జాబ్ మేళాలను (Job Mela) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. దూరమైన కుమారుడి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కోమటిరెడ్డి. ఆ ఫౌండేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రతీక్ ఫౌండేషణ్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 250 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా ఆ 250 కంపెనీల్లో మొత్తం 20 వేలకు పైగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు చేశారు. ఎన్నో సేవాకార్యక్రమాలలో ముందుండే ప్రతీక్ ఫౌండేషన్ దేశవ్యాప్త యువతను ప్రధానంగా వేధిస్తున్న నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిందని ఆయన అన్నారు.

ముఖ్యంగా తెలంగాణలో ఎన్నో ఆశలతో తమ విద్యను పూర్తి చేసుకున్న లక్షల మంది ఉద్యోగార్థుల కోసం నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి ఈ నెల 15, 16 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతీక్ ఫౌండేషన్ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్ మెంట్, ఫార్మా మరియు బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక కంపెనీలు ఈ మేళాలో ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నట్లు వివరించారు.

Rajanna Siricilla: విద్యార్థులు, నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.., జాబ్ గ్యారెంటీ కోర్సుల్లో ట్రైనింగ్.. వివరాలివే..!

250 కంపెనీలు దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలతో ఈ జాబ్ మేళాలో నిరుద్యోగుల ముందుకు వస్తున్నాయన్నారు. టెన్త్, ఇంటర్ మొదలుకొని బీ.టెక్, ఎం.టెక్, ఎంబీఏ, బీఫార్మా, ఎంఫార్మా, ఇంకా అన్ని డిగ్రీ, పీజీలు పూర్తిచేసుకున్నవారికి ఇదొక చక్కని అవకాశమని వెంకట్ రెడ్డి అన్నారు. ఏ మాత్రం ఉద్యోగానుభవం లేని కొత్తవారికి, 2012-2022 సంవత్సరాల్లో చదువు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశమన్నారు.

నిపుణ, సేవా ఇంటర్నేషనల్ తో కలిసి ప్రతీక్ ఫౌండేషన్ అందిస్తున్న ఈ ఉద్యోగావకాశాలను రాష్ట్రంలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు +91-9032586124, +91-9059186124, +91-9032186124 నంబర్లను సంప్రదించాలని సూచించారు. లేదా www.nipunahds.com, www.techfynder.com/job-seeker, www.hrco.in వెబ్ సైట్లను సందర్శించాలన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Komatireddy venkat reddy, Osmania University, Private Jobs

ఉత్తమ కథలు