తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు... అప్లై చేయండిలా

Telangana Model School Admissions | ఈ ప్రవేశ పరీక్షను ఆరో తరగతి, ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయా జిల్లాల్లోని మోడల్ స్కూల్స్ లో ఖాళీల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

news18-telugu
Updated: February 5, 2020, 2:31 PM IST
తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు... అప్లై చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆంగ్ల మాధ్యమంలో పూర్తిగా ఉచిత విద్య.. నిష్ణాతులైన ఉపాధ్యాయులు.. కార్పోరేట్ స్థాయి సౌకర్యాలు.. ఇవన్నీ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశం పొందడంతో సొంతం చేసుకోవచ్చు. ఆదర్శ పాఠశాలల్లోని ఆరో తరగతి, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 28న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందు ఈనెల(ఫిబ్రవరి)29 చివరితేదీగా పేర్కొంది. అయితే ఈ ప్రవేశ పరీక్షను ఆరో తరగతి, ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయా జిల్లాల్లోని మోడల్ స్కూల్స్ లో ఖాళీల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

Telangana Model School Admissions: గుర్తుంచుకోవాల్సిన తేదీలునోటిఫికేషన్ విడుదల- 28.01.2020
ఆన్ లైన్ పేమెంట్- ఫిబ్రవరి 3 నుంచి 29వ తేదీ వరకు ఆరో తరగతి, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఏడు నుంచి పది తరగతులు (సీట్ల ఖాళీల ఆధారంగా)
ఆన్ లైన్ దరఖాస్తు- ఫిబ్రవరి 4 నుంచి 29 వరకు ఆరో తరగతి,
ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు ఏడు నుంచి పదో తరగతి
హాల్ టికెట్స్ డౌన్ లోడ్- ఏప్రిల్ 4 నుంచి 12 వరకుప్రవేశ పరీక్ష- ఏప్రిల్ 12(ఆదివారం)
పరీక్షా సమయం- ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు,
ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4 వరకు.
పరీక్షా కేంద్రాలు- అన్ని జిల్లా కేంద్రాల్లో.
పరీక్షా ఫలితాలు- మే 20
ఫలితాల తుది జాబితా ప్రకటన- మే 27
ధ్రువపత్రాల పరిశీలన- మే 28 నుంచి 31 వరకు

Telangana Model School Admissions: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హత, వయస్సు- ఆరో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే 2019-20 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. ఆగస్టు 31, 2020 నాటికి పది సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలి. ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు వరుసగా 11 సంవత్సరాలు, 12, 13, 14 సంవత్సరాల వయస్సు పూర్తయ్యి ఉండాలి.
దరఖాస్తు విధానం: మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు http://telanganams.cgg.gov.in/online లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.75 కాగా, ఇతరులు రూ.150.
పరీక్షా విధానం- ప్రవేశ పరీక్షను రెండు గంటల పాటు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం పూర్తిగా సిలబస్ మీద ఆధారపడి ఉంటుంది. అందులో 100 ప్రశ్నలకు 100 మార్కులుగా ఉంటాయి. ఏ తరగతిలో ప్రవేశం కోసం పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు అంతకుముందు తరగతి సిలబస్ (6వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు 5వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు వస్తాయి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఆరో తరగతిలో చేరే విద్యార్థులకు తెలుగు, గణితం, సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఉంటాయి. ఇక ఏడు నుంచి పదిలో చేరే విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి 25 మార్కుల చొప్పున 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ISRO YUVIKA 2020: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇస్రో నుంచి గొప్ప ఛాన్స్

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
Published by: Santhosh Kumar S
First published: February 5, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading