రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను (Telangana Gurukul Schools) తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా స్వచ్ఛ గురుకుల ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల విద్యాలయాలలో ఈ నెల 5నుండి11వతేది వరకు నిర్వహించనున్న స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ కార్యక్రమం, పోస్టర్ ను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవన్ లో రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ గురుకుల ఉపాధ్యాయులు (Teachers), స్టాఫ్ అందరు ఇందులో భాగస్వామ్యం అవుతారని అన్నారు. అంతే కాకుండా ప్రజా ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని.. కార్యక్రమంలో వారి పర్యవేక్షణ ఉంటుందని మంత్రి తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా అయితే విద్యార్థులపై పర్యవేక్షణ కొనసాగుతుందో ఇకపై గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, నుంచి వారి ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రోగ్రెస్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇంటి వద్ద నుండి గురుకులంకు వచ్చే ప్రతి విద్యార్థికి హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ పై ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. గురుకులాల్లో విద్యార్థుల పర్యవేక్షణ కోసం 24 గంటలు ఒక ఏఎన్ఎం తో పాటు వార్డెన్ అందుబాటులో ఉంటారని, ఏదైనా ఇబ్బంది వస్తే తక్షణమే ఆసుపత్రికి చేర్చే విధంగా, చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
Telangana Gurukuls: వచ్చే నెలలోనే కొత్త గురుకులాలు ప్రారంభం.. ఏయే జిల్లాలో రానున్నాయంటే..?
ఇక రాష్ట్రంలోని 160 గురుకులాలు, 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు నడుస్తున్నాయని వాటితో పాటు ఆశ్రమ పాఠశాలలో సైతం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ప్రకృతి, పరిశుభ్రత, పర్యావరణం లోని పచ్చదనం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడంతోపాటు వారి బాధ్యతల్ని గుర్తు చేసే విధంగా గురుకులాల్లో ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన అధికారులను మంత్రి అభినందించారు.
క్లీన్ క్యాంపస్ డ్రైవ్ /స్వేచ్ఛ గురుకుల పేరుతో సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రారంభించినున్న ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. గురుకుల పరిశుభ్రత అనేది కేవలం స్వీపర్లది మాత్రమే కాదని, మన అందరి నైతిక బాధ్యత అని మంత్రి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Swachh Bharat, Telangana schools, Ts gurukula