రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్ (Malabar Group) ఏర్పాటు చేయనున్న బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఈ రోజు శంకుస్థాపన చేశారు. రూ. 750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారం మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌గా నిలువనుంది. ఈ పెట్టుబడితో మొత్తం 2,750 మందికి ఉపాధి (Jobs) అవకాశాలు లభించనున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ కు తెలంగాణలో (Telangana) ప్రస్తుతం 17 రిటైల్ షోరూమ్ లు ఉండగా, వెయ్యి మందికి పైగా ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టడంపై మలబార్ గోల్డ్ & డైమండ్స్ యజమానులను అభినందించారు. కార్యక్రమంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అహమ్మద్ ఎం.పీ., వైస్ ఛైర్మన్ అబ్దుల్ సలామ్ కే.పి తదితరులు పాల్గొన్నారు.
Mega Job mela in Hyderabad: నేడు, రేపు ఉస్మానియా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా.. 250 కంపెనీల్లో 20 వేలకు పైగా జాబ్స్ .. కోమటిరెడ్డి ప్రతీక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
Minister @KTRTRS speaking after laying foundation stone for Malabar Gems and Jewellery Manufacturing unit in Telangana https://t.co/TWCVbEBKVf
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 15, 2022
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ (Hyderabad) నగరం అరుదైన ఘనతను అందుకోబోతుంది. న్యూయార్క్, లండన్, బెర్లిన్ లాంటి సిటీల సరసన నిలవబోతుంది. వచ్చే ఏడాది హైదరాబాద్ వేదికగా ఫార్మాలా ఈ (Formula E) రేసు జరగనుంది. ఇప్పటికే ఫార్ములా ఈ నిర్వాహకులు విడుదల చేసిన 9వ సీజన్ క్యాలెండర్ లో హైదరాబాద్ కు చోటు కల్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఫార్మాలా ఈ రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు రోజుల పాటు 22 కార్లు హైదరాబాద్ నక్లెస్ రోడ్డుపై దూసుకెళ్లనున్నాయి.
దాంతో ఫార్ములా ఈకి ఆతిథ్యమివ్వనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ ఘనత వహించనుంది. ఇక ఈ రేసుకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్ లో ఈ-మొబిలిటీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, Malabar gold, Minister ktr, Private Jobs