హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs Study Material: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి స్టడీ మెటీరియల్.. విడుదల చేసిన కేటీఆర్

Telangana Jobs Study Material: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి స్టడీ మెటీరియల్.. విడుదల చేసిన కేటీఆర్

స్టడీ మెటీరియల్ ను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్

స్టడీ మెటీరియల్ ను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్

తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం స్టడీ మెటీరియల్ ను (TS Competitive Examination Study Material) రూపొందించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం స్టడీ మెటీరియల్ ( Dr. B.R. Ambedkar Open University Competitive Examination Study Material) ను రూపొందించారు. ఈ స్టడీ మెటీరియల్ ను మంత్రులు కేటీఆర్‌ (Minister KTR), శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఉద్యమ సహచరులంతా ఒకే వేదికపై కనిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో అంబేద్కర్‌ వర్సిటీలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నానని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.


  తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారని చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. స్టడీ మెటీరియల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు అందించాలన్నారు. ఈ ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు.
  NIMS Recruitment 2022: హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ.32 వేల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి


  చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది

  మన రాష్ట్రంలో రెండు జీవనదులతోపాటు 46 వేల చెరువులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కృషితో సాగునీటిరంగంలో ఘననీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న 46 వేల చెరువులను బాగుచేసుకుంటే దాదాపు నాగార్జున సాగర్‌ కెపాసిటీ ఉంటుందని ఉద్యమనేత కేసీఆర్‌తోపాటు జయశంకర్‌ సార్‌ చెప్పేవారని గుర్తుచేశారు.


  ఇప్పుడు ఆ చెరువులన్నింటినీ బాగుచేసుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితి మారిందన్నారు. చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పారు. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రమని వెల్లడించారు. ఇంటింటికీ నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి మిషన్‌ చెప్పిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని, అలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఉండటం గర్వకారణమన్నారు. శతాబ్దకాలం వరకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీళ్లందించేలా కాళేశ్వరాన్ని నిర్మించామని చెప్పారు.
  సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శం

  సంక్షేమరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ పదిరెట్లు పెరిగిందని వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా.. ఏం తినాలి, ఏం వేసుకోవాలని డిక్టేట్‌ చేస్తున్నారని విమర్శించారు. మతం, కులం గురించి కొట్లడుకోవడం వల్లే దేశం వెనుకబడిందని ఆరోపించారు. అయితే కులమతాలను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లకు చేరిందన్నారు.
  టీహబ్‌, వీహబ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని మంత్రి తెలిపారు. అందుకే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో లక్షా 55 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, KTR, Sabitha Indra Reddy, State Government Jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు