Lockdown: విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచనలు ఇవే...

T-SAT | లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్నారా? పాఠాలు మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారా? తెలంగాణ మంత్రి కేటీఆర్ చెబుతున్న ఈ సూచనలు పాటించండి.

news18-telugu
Updated: April 6, 2020, 12:02 PM IST
Lockdown: విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచనలు ఇవే...
మంత్రి కేటీఆర్ ఫైల్ ఫోటో
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి నుంచే పాఠాలు నేర్చుకోవచ్చని ట్విట్టర్‌లో సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీ-శాట్ ఛానెళ్లను ఉపయోగించుకొని ఇంట్లోనే మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకోవచ్చని, పోటీ పరీక్షలకు సిద్ధం కావొచ్చని కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు. టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ http://tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile App లలో అందుబాటులో ఉంటాయి.


స్కూలు విద్యార్థులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, ఉన్నత విద్య చదువుతున్న వారికి నాణ్యమైన పాఠాలను అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ విభాగమైన తెలంగాణ స్కిల్స్ అకడమిక్ అండ్ ట్రైనింగ్ T-SAT ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విద్యా రంగంలోని నిపుణులు విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంటారు. స్కూళ్లకు వెళ్లలేకపోతున్న విద్యార్థుల కోసం టీఎస్ క్లాస్ పేరుతో డిజిటల్ లెస్సన్స్ రూపొందించారు. ఎంసెట్, ఐఐటీ, నీట్ లాంటి పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC లాంటి సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ పాఠాలు ఉపయోగపడ్తాయి.


ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు టీ-సాట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీడియో పాఠాలు ప్రసారమౌతాయి. గతంలో రికార్డ్ చేసిన వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి. రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రూపొందించిన 86 గంటల డ్యూరేషన్ గల స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు ఉన్నాయి. మరి మీరు కూడా టీ-సాట్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించాలనుకుంటే యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి, వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని షిప్‌యార్డ్‌లో జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఈ పరీక్షలు రాయండి

HDFC Bank Jobs: డిగ్రీ పాసైతే చాలు... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాలు
First published: April 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading