హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: రెండు రోజుల్లో మరో 1140 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Telangana Govt Jobs: రెండు రోజుల్లో మరో 1140 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల్లో మరో 1140 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన మేరకు ఇటీవల వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మరో కీలక ప్రకటన చేశారు. వైద్యశాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిమ్స్‌ హాస్పటల్ లో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ (Telangana Jobs Notification) విడుదల చేయనున్నట్లు చెప్పారు. పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి రాబోయే పది రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. మరో 140 మంది మిడ్‌ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని మంత్రి చెప్పారు.

  ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ శాఖలో(Panchayat Raj Department) కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో పంచాయతీ రాజ్ శాఖలో ఈ పోస్టులను మంజూరు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు(Hanumanth Rao) ఇటీవల జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జూనియర్ అసిస్టెంట్ 253, సూపరింటెండెంట్ 103, సీనియర్ అసిస్టెంట్ 173 పోస్టులు ఉన్నాయి. మొత్తం 529 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు.

  Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ షాక్.. కేసీఆర్ ప్రకటనతో అన్ని నోటిఫికేషన్లకు బిగ్ బ్రేక్?

  కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులను అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ  జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 4 కింద నోటిఫై చేసిన 9వేల పైచిలుకు పోస్టుల్లో వీఆర్ఓల భర్తీ కారణంగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

  వాటి స్థానాల్లో ఈ కొత్త పోస్టులను ప్రభుత్వానికి చూపించనున్నట్లు సమాచారం. తాజాగా మున్సిపాలిటీ నుంచి కొత్తగా 2670 పోస్టులు మంజూరయ్యాయి. వీటిని కూడా గ్రూప్ 4 కింద బర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కింద 6 రకాల కేటగిరీల కింద ఈ పోస్టులను క్రియోట్ చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Harish Rao, JOBS, State Government Jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు