Home /News /jobs /

TELANGANA MINISTER INDRAKARAN REDDY KEY ANNOUNCEMENT OVER NIRMAL MUNICIPALITY JOBS RECRUITMENT PROCESS NS ADB

TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీ నిలిపివేత.. మంత్రి షాకింగ్ ప్రకటన.. అక్రమాలపై విచారణకు ఆదేశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఓ నియామక ప్రక్రియ ఆగిపోయింది. తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నిజాలు తేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

    నిర్మల్ మున్సిపాలిటీలోని పిహెచ్సి విభాగంలో చేపట్టిన ఉద్యోగాల (Jobs) భర్తీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) ప్రకటించారు. గతకొన్నిరోజులుగా ఈ నియామకాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తున నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. నిర్మల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉంటే నిర్మల్ మున్సిపాలిటి (Nirmal Municipality) లో జరుగుతున్న ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలి ఫారూఖి ఆదేశాలాు జారీ చేశారు. నిర్మల్ ఆర్డిఓ ను విచారణ అధికారిగా నియమిస్తూ, 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు.

    ఇదిలా ఉంటే నిర్మల్ మున్సిపాలిటిలో చేపట్టిన ఉద్యోగ భర్తీ ప్రక్రియపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీకి చెందిన చైర్మెన్, కొందరు కౌన్సిలర్లు, అధికారులు కుమ్మక్కై అర్హులకు దక్కాల్సిన ఉద్యోగాలను తమ బంధువర్గానికి వక్ర మార్గంలో కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఉద్యోగ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. రెండు రోజుల క్రితం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
    Minister KTR: ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన.. మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులంటే?

    తాజాగా ఈ రోజు ఎఐసీసీ కార్యక్రమాల కమిటి చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక్క రోజు దీక్ష చేపట్టారు. నిర్మల్ మున్సిపల్  కార్యాలయంలో 44 ఉద్యోగ నియామకాల్లో అవకతవకులకు నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా మంత్రి, మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు పూనుకున్నారు. అయితే ఈ నిరసన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు మహేశ్వర్ రెడ్డి ని గృహ నిర్బంధం చేశారు.
    Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ తేదీలపై బోర్డు అధికారిక ప్రకటన

    దీనికి నిరసనగా మహేశ్వర్ రెడ్డి తన నివాస గృహం లోనే దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉంటే వివాదస్పదమైన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల నియామక ప్రక్రియపై విజిలెన్స్ విభాగం కూడా రంగంలో దిగి విచారణ చేపట్టినట్లు తెలిసింది. మరోవైపు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను తప్పుబట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వేసిన విచారణ కమిటి ఏం తేలుస్తుందో, తదుపరి ఏం చర్యలు ఉంటాయేనన్న ఆసక్తి సర్వత్ర వ్యక్తమవుతోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Minister indrakaran reddy, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు