Home /News /jobs /

TELANGANA MINISTER HARISH RAO SAYS GOVERNMENT WILL START RECRUITMENT PROCESS FOR 50 THOUSAND JOBS SOON NS

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

హరీష్ రావు(ఫైల్ ఫొటో)

హరీష్ రావు(ఫైల్ ఫొటో)

ఇటీవల వేతనాల పెంపుతో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ ప్రస్తుతం జాబ్స్ నోటిఫికేషన్స్ పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    వేతనాల పెంపుతో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ ప్రస్తుతం జాబ్స్ నోటిఫికేషన్స్ పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ రోజు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ శాసనసభ గురువారం పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్ పెంపు తదితర బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశ పెట్టిన బిల్లును ఈ రోజు అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని చెప్పారు.

    కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు ఉందని గుర్తు చేశారు. అయితే వయోపరిమితి పెంపు వల్ల నిరుద్యోగులకు అవకాశాలు రావని వస్తున్న విమర్శలపై సైతం మంత్రి స్పందించారు. ఈ నిర్ణయంతో ఉద్యోగ నియామకాలకు ఇబ్బంది లేదన్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుల చేయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.

    ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇటీవల శుభవార్త చెప్పారు. ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.  అందరూ అనుకున్న దాని కంటే ఒక శాతం ఎక్కువే ఫిట్‌మెంట్ ఇచ్చారు. మొత్తం 9.17 లక్షల మంది ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Budget 2021, Govt Jobs 2021, Harish Rao, JOBS, Telangana

    తదుపరి వార్తలు