Home /News /jobs /

TELANGANA MINISTER HARISH RAO HAS ISSUED AN ORDER APPROVING 58 POSTS IN SIDDIPET DISTRICT JAIL THE FULL DETAILS ARE AS FOLLOWS MDK VB

Telangana Government Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 58 పోస్టులను మంజూరు చేసిన ఆర్థిక మంత్రి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Government Jobs: రాష్ట్ర ఆర్థిక , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో 16 కేటగిరీలలో మొత్తం 58 పోస్టులు మంజూరయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
(K. Veeranna, News 18, Medak)

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు(Minister Harish Rao) ప్రత్యేక చొరవతో 16 కేటగిరీలలో మొత్తం 58 పోస్టులు మంజూరయ్యాయి. సిద్దిపేటజిల్లా జైల్ లో కొత్తగా పోస్టులు(Posts) మంజూరు చేయాలని అధికారులు తన దృష్టికి తేవడంతో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. కొత్త పోస్టుల మంజూరు అవశ్యకతను తెలియజేశారు. మరోవైపు కొత్త పోస్టుల మంజూరు చేయాల్సిందిగా జిల్లా జైల్(Jail) అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా ఇటీవలే రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్దిపేట జిల్లా జైల్ కు కొత్తగా పోస్టులను(New Posts) మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 124 ను(GO No. 124)  విడుదల చేసింది.

Jobs In Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్య శాఖలో పలు పోస్టులకు నోటిఫికేషన్..


కొత్తగా మంజూరైన పోస్టులు ఇవే..

1. డిప్యూటీ సూపరిండెంట్ -1 ( ఒక పోస్ట్),
2. సివిల్ అసిస్టెంట్ సర్జన్-1,
3. జైలర్ -2 ,
4. డిప్యూటీ జైలర్ -1,
5. సీనియర్ అసిస్టెంట్ -1,
6. జూనియర్ అసిస్టెంట్ - 1,
7. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 - 1 ,
8. ఎలక్ట్రిషన్ -1,
9. చీఫ్ హెడ్ వార్డర్ -1 ,
10. హెడ్ వార్డర్ - 11 ,
11. వార్డ ర్ - 28 ,
12. ఫిమేల్ వార్డర్ - 4 ,
13. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 1,
14. మోటార్ సైకిల్ ఆర్డర్లీ - 1,
15. మోటర్ సైకిల్ ఆర్డర్లీ - 1,
16. డ్రైవర్ - 1,
17. బార్బర్ - 1
ఇలా మొత్తం 58 పోస్టులు మంజూరయ్యాయి.



ఇటీవల తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇటీవల డీఏఓ, ఫుడ్ ఇన్ స్పెక్టర్ వంటి పోస్టులకు నోటిఫికేషన్లను విడుదల చేశారు. అంతే కాకుండా.. గురుకుల పోస్టులకు కూడా ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించింది. తాజాగా ఆర్థిక మంత్రి సిద్దిపేట జిల్లా జైలులో ఖాళీగా ఉన్న 58 పోస్టులను మంజూరు చూస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

రంగారెడ్డి డీఎంహెచ్ఓలో ఖాళీలు..
కరోనా ప్రారంభం నాటి నుంచి కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య విభాగం బలోపేతంపై శ్రద్ధ చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఖాళీలను (Job Vacancies) భర్తీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సైతం వైద్య రంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : డిగ్రీ అర్హత..పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. వివరాలిలా.. 

తాజాగా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO-Rangareddy) పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజును అంటే ఆగస్టు 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Harish Rao, JOBS, Telangana government jobs

తదుపరి వార్తలు