హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: మంత్రి హరీశ్ రావు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన.. వివరాలివే

Telangana Govt Jobs: మంత్రి హరీశ్ రావు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన.. వివరాలివే

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మరో శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మరో శుభవార్త చెప్పారు. ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఖాళీలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నట్లు చెప్పారు. ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం ల్యాబ్స్ పని తీరు, సాధించిన పురోగతిపై వెంగళరావు నగర్ లోని IIHFW కార్యాలయంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలన్నారు. వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతామని తెలిపారు.

ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. ఒక వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోందన్నారు. కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయన్నారు.

Telangana SI, Constable Exam Results: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడంటే?

జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుందన్నారు. కల్తీ ఆహారం పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించి, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ఇంకా @AFCGHMC ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులు రాగానే అధికారులు వెళ్లి చర్యలు తీసుకుంటారన్నారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: JOBS, Minister harishrao, State Government Jobs, Telangana government jobs, Tspsc jobs

ఉత్తమ కథలు