Home /News /jobs /

TELANGANA MINISTER HARISH RAO GOOD NEWS TO STUDENTS WHO PLANS TO STUDY IN ABROAD NS MDK

Minister Harish Rao: విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి మంత్రి హరీశ్ శుభవార్త.. ఫ్రీగా శిక్షణ, వీసా ప్రాసెసింగ్

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. అలాంటి విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ , ప్రాసెసింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

    విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సిద్దిపేట (Siddipet) నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) శుభవార్త చెప్పారు. అలాంటి విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ , ప్రాసెసింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోని 2020 - 21 సం. లో డిగ్రీ , బి టెక్ పూర్తి చేసి విదేశీ వెళ్లి ఉన్నత చదువు లు చదువుకోవాలని ఆసక్తి ఉండే వారికి GRE , TOEFL తదితర పరీక్షలకు శిక్షణ మరియు వీసా ప్రాసెసింగ్ పూర్తి ఉచితంగా అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. Edu-cog సంస్థను ఒప్పించి సిద్దిపేట విద్యార్థుకు విదేశీ ఉన్నత విద్యకు ప్రోత్సాహిస్తున్నట్లు వివరించారు. ఈ సంస్థ ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులకు మన సిద్దిపేట లోనే ఉచితంగా వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చి, వారు అనుకున్న కోర్స్ లో ప్రవేశం పొందే వరకు అన్ని రకాల శిక్షణ, దిశానిర్దేశం ఉచితంగానే అందిస్తుందని చెప్పారు. ఈ గొప్ప అవకాశాన్ని సిద్దిపేట విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఆసక్తి కలిగిన వారు సిద్దిపేట లోని తన క్యాంప్ కార్యాలయంలో ఓఎస్డీ బాల్ రాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయి రాంను సంప్రదించాలని మంత్రి సూచించారు.

    ఇదిలా ఉంటే.. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Telangana Police Jobs) నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) శుభవార్త చెప్పారు. మరో వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వారంలో పోలీస్ జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని చెప్పారు. కష్టపడి చదవాలని అభ్యర్థులకు మంత్రి సూచించారు. ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీసు ఖాళీలు కలిపి మొత్తం 20 వేల ఉద్యోగాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. మొత్తం 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని మంత్రి చెప్పారు. అభ్యర్థులంతా ఇష్టపడి చదివి ఉద్యోగం కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
    Jobs in Telangana: కేంద్ర సంస్థ‌లో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

    తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 32 వేల పోస్టులు నింపామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. తాజా నోటిఫికేషన్లతో మొత్తం 2 లక్షల పైగా నింపినట్లు అవుతుందన్నారు. వచ్చే ఏడాది నుండి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీపై మంత్రి ధ్వజమెత్తారు. మోకాళ్ళ యాత్ర, పాద యాత్ర చేయడం కాదు.. 15 లక్షల ఉద్యోగాలను కేంద్రం నింపాలని సూచించారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల వారు వచ్చి పని చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగుంటే ఇక్కడికి ఉపాధి, ఉద్యోగం కోసం ఎందుకు వస్తారని హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రశ్నించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Harish Rao, Higher education, Siddipet

    తదుపరి వార్తలు