నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM) మార్చి నెలలో అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను(Job Notifications) వెల్లడిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటి వరకు 45వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి వచ్చింది. అయినా నోటిఫికేషన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. పోలీస్(Police), గ్రూప్ 1(Group 1) పోస్టులు మినహా ఇంత భారీ మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు రాలేదు. ఇటీవల మోటార్ ఇన్ స్పెక్టర్, ఫుడ్ ఇన్ స్పెక్టర్, డివిజన్ అకౌంట్ ఆఫీర్ వంటి వాటికి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేసింది.
అయితే ఈ పోస్టులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో.. నిరుద్యోగులు ఎక్కువగా గ్రూప్ 4 ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువ ఉద్యోగాల భర్తీ దీనిలో జరగనున్నాయి. ఇక మొత్తం పోస్టుల్లలో గ్రూప్ 1 పోస్టులు 503, గ్రూప్ 2 పోస్టులు 582, గ్రూప్ 3 పోస్టులు 1373, గ్రూప్ 4 పోస్టులు 9168 ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు.. క్యాడర్ వారీగా పోస్టులను కూడా నోటిఫై చేశారు. అయితే వీటిలో ఎక్కువగా నిరుద్యోగులు గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు.
వీటి భర్తీపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉద్యోగ నోటిఫికేషన్ సమీక్ష ప్రక్రియ నిర్వహించిన మంత్రి హరీష్ రావు.. తెలంగాణలో ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్లను అతి వేగంగా జారీ చేయాలని దీనిలో భాగంగా.. గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాల నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ల జారీగా ఆలస్యం చేయవద్దని.. మంద్రి అధికారులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Group 4, Harish Rao, JOBS, TSPSC