Home /News /jobs /

TELANGANA MINISTER HARISH RAO CONDUCTING JOB MELA FOR UNEMPLOYED ON APRIL 9 HERE FULL DETAILS NS MDK

Job Mela - Harish Rao: మంత్రి హరీశ్ ఆధ్వర్యంలో 9న భారీ జాబ్ మేళా.. వెంటనే ఆఫర్ లెటర్.. వారంలో జాయినింగ్.. ఎక్కడంటే?

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

తెలంగాణలో ఈ నెల 9న భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. మంత్రి హరీశ్ రావు (TS Minister Harish Rao) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధుల చొరవతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల వరుసగా జాబ్ మేళా(Job Mela)లను నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) చొరవతో భారీ జాబ్ మేళాను ఈ నెల 9న శనివారం నిర్వహించనున్నారు. లోడ్ షేడ్ సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు లాజిస్టిక్ డోర్ డెలివరీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ (Hyderabad) లోడ్ షేర్ సంస్థ ప్రతినిధి భరత్ తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవ, సహకారంతో ఈ నెల 9వ తేదీ శనివారం రోజున సిద్ధిపేట పట్టణంలోని పోలీసు కన్వెన్షన్ సెంటరులో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

    సిద్దిపేట ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం మంత్రి సమక్షంలో పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మీల్ ఖాన్, నియోజక వర్గ ప్రజాప్రతినిధులతో హైదరాబాదుకు చెందిన లోడ్ షేర్ ప్రముఖ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఇంకా స్త్రీ, పురుష భేదం లేకుండా 7వ తరగతి, ఆ పై విద్యార్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని వారు సూచించారు.
    TS Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. ఇలా అప్లై చేసుకోండి

    సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని యువతీ, యువకులకు మంచి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో డోర్ డెలివరీ బాయ్స్ ఉద్యోగాన్ని ఇవ్వడంతో పాటు ఒక ఎలక్ట్రిక్ బైక్, వసతి సదుపాయాలతో సహా ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన లోడ్ షేర్ సంస్థ ప్రతినిధి భరత్ మాట్లాడుతూ.. 35 ఏళ్లలోపు స్త్రీ, పురుషులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. డోర్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్ గా పని చేసేందుకు ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.
    TSPSC Group-1, Group-2 Jobs: గ్రూప్-1, గ్రూప్2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం?

    ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్, డ్రైవింగ్ లైసెన్సు తదితర వివరాలతో 9వ తేదీన ఉదయం 9 గంటలకు జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు అప్పటికప్పుడే ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తామన్నారు. అభ్యర్థులు వారం లోపు ఉద్యోగ విధుల్లో చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ సదవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Harish Rao, Job Mela, Siddipet, Telangana

    తదుపరి వార్తలు