Home /News /jobs /

TELANGANA MINISTER ERRABELLI DAYAKAR RAO KEY ANNOUNCEMENT OVER MGNREA FIELD ASSISTANTS NS

Telangana Government: ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. నేటి నుంచే విధుల్లోకి.. మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు

సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఫొటో)

విధుల నుంచి తొలగించడంతో రోడ్డున పడి ఇబ్బంది పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ సర్కార్ (Telangana Government) శుభవార్త చెప్పింది. వారిని మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Warangal
    విధుల నుంచి తొలగించడంతో రోడ్డున పడి ఇబ్బంది పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ సర్కార్ (Telangana Government) శుభవార్త చెప్పింది. వారిని మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచే ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (Telangana Minister Errabelli Dayakar Rao) అధికారులను ఆదేశించారు. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్లు, సంబంధిత జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. గతంలో పని చేసిన స్థానాల్లోనే ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధులు నిర్వర్తించనున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. గతంలో వేతనాలు పెంచడంతో పలు డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ (CM KCR) సర్కార్ వారిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దీంతో వారంతో వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు, వివిధ వర్గాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ వారందరినీ విధుల్లోకి తీసుకుంటామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. అయితే.. సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి మళ్లీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో వారిలో మళ్లీ ఆందోళన వ్యక్తం అయింది. అయితే.. ఎట్టకేలకు వీరిని విధుల్లోకి తీసుకోవడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేయడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.



    ఇదిలా ఉంటే.. భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో బంగారు పతకం సాధించారు. బర్మింగ్ హామ్‌లో జరుగుతున్న గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో కెనడా క్రీడాకారిణి మిచెల్‌ లీని ఓఢించిన పీవీ సింధు కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలన్న తన కలను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు బంగారు పతకం గెలవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధును కేసీఆర్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు ఈవిధంగా పతకాలతో దేశానికి, రాష్ట్రానికి పేరు తేవడం గర్వించదగిన విషయమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Errabelli Dayakar Rao, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు