Hyderabad Job Mela: హైదరాబాద్‌లో జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత

Hyderabad Job Mela | హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తో పాటు తెలంగాణలోని వేర్వేరు చోట్ల వీరిని పోస్టింగ్ ఇవ్వనున్నాయి కంపెనీలు. టెన్త్ నుంచి పీజీ వరకు ఏం చదివినా ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.

news18-telugu
Updated: December 12, 2019, 1:35 PM IST
Hyderabad Job Mela: హైదరాబాద్‌లో జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత
Hyderabad Job Mela: హైదరాబాద్‌లో జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ... ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇది మంచి అవకాశం. హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతీయువకులకు 2019 డిసెంబర్ 14న జాబ్ మేళా జరగబోతోంది. బడంగ్‌పేటలోని పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా జరగనుంది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-MEPMA ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళా ఇది. నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా మెప్మా అధికారులు కోరుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, అపోలో ఫార్మసీ, అభి బస్, క్యూర్ ఫిట్, స్విగ్గీ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి 27 సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. వందలాది ఉద్యోగులను నియమించుకోనున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తో పాటు తెలంగాణలోని వేర్వేరు చోట్ల వీరిని పోస్టింగ్ ఇవ్వనున్నాయి కంపెనీలు. టెన్త్ నుంచి పీజీ వరకు ఏం చదివినా ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. నిరుద్యోగులు ముందుగా www.jobmela.tmepma.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే వెబ్‌సైట్‌లో కంపెనీల జాబితా, ఖాళీల వివరాలు ఉంటాయి.

MEPMA Job Mela: మెప్మా జాబ్ మేళాకు రిజిస్టర్ చేసుకోండి ఇలా...


నిరుద్యోగులు ముందుగా www.jobmela.tmepma.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

GET REGISTERED లింక్ పైన క్లిక్ చేయాలి.
జాబ్ మేళా జరిగే ప్రాంతాన్ని ఎంచుకోవాలి.
ఆ తర్వాత పేరు, జెండర్, పుట్టిన తేదీ, అర్హతలు, అడ్రస్, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.


రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఓ QR Code వస్తుంది.ఆ QR Code ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
లేదా స్మార్ట్‌ఫోన్‌లో QR Code చూపించి డిసెంబర్ 14న జరిగే జాబ్ మేళాకు హాజరుకావచ్చు.
QR Code లేని అభ్యర్థులు తమ బయోడేటాను 5 సెట్లు జిరాక్స్ తీసుకొని జాబ్ మేళాకు వెళ్లాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Bank of Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Railway Jobs: ఉత్తర మధ్య రైల్వేలో 296 జాబ్స్... పూర్తి వివరాలివే
First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>