Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలోని ఆ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్‌లోని ప్ర‌భుత్వ మెడికల్‌ కాలేజీలో పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వ వైద్య విద్యా విభాగం ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిజామాబాద్‌లోని ప్ర‌భుత్వ మెడికల్‌ కాలేజీలో పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వ వైద్య విద్యా విభాగం ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం 35 పోస్టుల భ‌ర్తీకి నియామకాలు చేపట్టారు. వాక్ఇన్ ఇంటర్వ్యూల నిర్వహించి అందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఇందు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రరంభించగా.. రిజిస్ట్రేషన్ కు ఫిబ్రవరి 16 ఆఖరి తేదీ. నిర్వ‌హిస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు http://www.gmcnzb.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
    మొత్తం 35 పోస్టులను భర్తీ చేస్తుండగా.. సీనియ‌ర్ రెసిడెంట్‌ విభాగంలో 26 పోస్టులు ఉన్నాయి. సైకియాట్రీ, పీడియాట్రిక్స్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, ఎమ‌ర్జ‌న్సీ మెడిసిన్‌, హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ త‌దిత‌రార విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర మెడికల్ లో రిజిస్టర్ అయి, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్/ఎండీ/డీఎన్బీ, డొప్లొమో చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 44 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 70 వేల వేతనం చెల్లించనున్నారు.
    Official Website-Direct Link
    Notification-Direct Link

    జూనియర్ రెసిడెంట్ విభాగంలో మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు MBBSలో ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్ర మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌రై ఉండాలి. ఆగస్టు 31 నాటి 39 గరిష్టంగా 39 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,600 వేతనంతో పాటు డీఏ చెల్లించనున్నారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: