Haribabu, News18, Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లోని వివిధ ప్రాంతాలలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి సుమన్ మోహన్ రావు ప్రకటనలో తెలిపారు.ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో నమోదైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఆసక్తి,అర్హత ఉన్న వారు ఈనెల 30వ తేదీ లోపు వైద్య ఆరోగ్య శాఖ, కార్యాలయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు జత చేసి దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి..జిల్లా కలెక్టర్,మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 24.11.2022 నుంచి అనగా నేటి నుంచి 30.11.2022 వరకు సాయంత్రం 5.00గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పూర్తి బయోడేటా సంబంధిత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని జిల్లా వైద్యరక శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.
వెండింగ్ స్టాల్స్ కుదరఖాస్తులు ఆహ్వానం..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో మెప్మా ఆధ్వర్యంలో నిర్మించిన వెండింగ్ స్టాల్స్ కు వీధి విక్రయదారులకు కేటాయిస్తున్నట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య ప్రకటించారు. వీధి వ్యాపారుల ఉపాధికై మొత్తంగా 69 స్టాల్స్ నిర్మించగా తారకరామానగర్( 14), నెహ్రూనగర్(2), బీవైనగర్ (10), బతు కమ్మఘాట్(16) మొత్తంగా 49 ఖాళీ ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిని ఈనెల 29న డ్రా పద్ధతిలో కేటాయిస్తామన్నారు.అర్హులైన వీధి విక్రయదారులు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 28 సాయంత్రం 5 గంటలలోపు ధరఖాస్తులు సమర్పించాలని కమిషనర్ కోరారు.ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Telangana government jobs