హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Results: విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Telangana Results: విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Lawcet Results: తెలంగాణ లాసెట్‌ , పీజీ లా సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి..

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ లాసెట్ ఫలితాలను(Lawcet 2022 Results) అధికారులు విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు ఈ https://lawcet.tsche.ac.in/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) ఛైర్మన్ ఆర్‌ లింబాద్రి ప్రకటించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

PNB Recruitment 2022: డిగ్రీ అర్హత.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. వివరాలిలా.. 


కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అనేక అడ్డంకుల నడుమ సాగిన ప్రవేశ పరీక్షలు, ఫలితాలు, అడ్మిషన్ల ప్రక్రియ ఈ ఏడాది ఎలాంటి అవంతరాలు లేకుండా సాఫీగా సాగుతోంది. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్ తదితర పరీక్షల నిర్వహణ పూర్తి కాగా ఫలితాలు సైతం విడుదలయ్యాయి.ఇటీవల లాసెట్ (TS Lawcet 2022) పరీక్ష నిర్వహణ పూర్తికాగా.. ఈ రోజు ఆ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ ఏడాది  లాసెట్‌, పీజీ లాసెట్‌ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారు.

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ లో ఉద్యోగాలు.. జీతం రూ.1.20 లక్షలు..


జూలై 21, 22 వ తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 28,921 మంది విద్యార్ధులు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు 68.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం పీజీ లా సెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

- అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

- అక్కడ డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.

- అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

- డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ర్యాక్ ఎంతో తెలుసుకొని ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కొరకు దగ్గర పెట్టుకోండి.

ఇదిలా ఉండగా.. ఆగస్టు మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో లాసెట్ 3 ఏళ్ల కోర్సుకు 90.81శాతం ఉత్తీర్ణత సాధించగా.. లాసెట్ 5ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించారు. లాసెట్ లో ఎక్కువగా మహిళలే ఉత్తీర్ణత సాధించారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Results, TS Lawcet 2022

ఉత్తమ కథలు