హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Exams Postponed: తెలంగాణలో పోలీస్ ఈవెంట్స్.. ఆ పరీక్షలన్నీ వాయిదా!

Telangana Exams Postponed: తెలంగాణలో పోలీస్ ఈవెంట్స్.. ఆ పరీక్షలన్నీ వాయిదా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రస్తుతం ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఈవెంట్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్స్ ప్రక్రియ జనవరి 3 నాటికి ముగియనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Warangal

తెలంగాణలో ప్రస్తుతం ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఈవెంట్స్ (TS Police Jobs Events) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్స్ ప్రక్రియ జనవరి 3 నాటికి ముగియనున్నాయి. అయితే.. ఈ ఈవెంట్స్ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా (Exams Postponed) వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈవెంట్స్ కు హాజరు కావాల్సిన యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని కోరడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ తెలిపింది. అయితే.. ఈవెంట్స్ జనవరి 3న ముగుస్తుండడంతో 5వ తేదీ నుంచి పరీక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. UG BA/BA.(L)/BBA/BCA/B.Com/B.Sc/B.Voc III & V మరియు BHM & CT III & IV సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో(Telangana) 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన మేరకు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నెలలో ఇప్పటికే గ్రూప్-4 తో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ వంటి ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. వీటితో పాటు.. డిసెంబర్ 21న హార్టికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశారు.

ఇలా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందిన 64వేలకు పైగా ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. నేడు గ్రూప్ 4 ఉద్యోగాలకు అప్లికేషన్ల(Applications) ప్రక్రియ ప్రారంభం కనుండగా.. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 30వ తేదీగా వాయిదా వేశారు. ఖాళీల భర్తీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు.

First published:

Tags: Exams postponed, JOBS, Kakatiya university, Telangana government jobs, Telangana police jobs

ఉత్తమ కథలు