హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

Telangana Jobs : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఉద్యోగాలు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఉద్యోగాలు

తెలంగాణలోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (District Medical and Health Officer) కార్యాల‌యంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 42 మెడిక‌ల్ స్టాఫ్‌ (Medical Officers) ఖాళీల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 21, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  తెలంగాణలోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (District Medical and Health Officer) కార్యాల‌యంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 42 మెడిక‌ల్ స్టాఫ్‌ (Medical Staff) ఖాళీల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌ (Offline) లోనే ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు పోస్టుల ఆధారంగా వేరుగా ఉంది. ఎటువంటి రాత ప‌రీక్ష (Written test) లేకుండా కేవ‌లం అకాడ‌మిక్ మెరిట్‌ (Academic Merit) ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 21, 2021 వ‌ర‌కు ఉంది. ద‌ర‌ఖాస్తుకు సంబంధించిన వివ‌రాలు, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్  https://yadadri.telangana.gov.in/notice_category/recruitment/  ను సంద‌ర్శించాలి.

  ముఖ్య స‌మాచారం..

  పోస్టుమెడిక‌ల్ స్టాఫ్‌
  పోస్టుల సంఖ్య 48
  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 18, 20, 21  (మూడురోజులు అవ‌కాశం)
  ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌నఅక్టోబ‌ర్ 29, 2021
  తుది మెరిట్ లిస్ట్అక్టోబ‌ర్ 29, 2021
  కౌన్సెలింగ్ తేదీఅక్టోబ‌ర్ 30, 2021


  ప‌రీక్ష ఫీజు ప్ర‌తీ పోస్టుకు రూ.200 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థు రూ.100 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

  FCI Recruitment 2021 : ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000


  పోస్టుల వారీగా వివరాలు.. అర్హ‌త‌లు


  పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలు
  ఎంపీహెచ్ఏ/ఏఎన్ఎంప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ పాసై ఉండాలి. 18 నెల‌ల‌పాటు ట్రైనింగ్ పూర్తి చేసిన ఎంపీహెచ్‌డ‌బ్ల్యూ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.31
  ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేడ్ -2ఇంట‌ర్మీడియ‌ట్, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణ‌త / బీఎస్సీ ఉత్తీర్ణ‌త క‌లిగి ఉండాలి08
  ఫార్మ‌సిస్ట్‌ఇంట‌ర్మీడియ‌ట్, డిప్ల‌మా ఇన్ ఫార్మ‌సీ /బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ ఫార్మ‌సీ చేసి ఉండాలి03  మార్కుల కేటాయింపు..

  - 100 మార్కులు ఉంటాయి.

  - 90 మార్కులు అకాడ‌మిక్ మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు.

  - 10 మార్కులు అభ్య‌ర్థి వ‌య‌సు ఆధారంగా కేటాయిస్తారు.

  ఎంపిక విధానం..

  Step 1 :  ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా ఎంపిక విధానం ఉంటుంది.

  Step 2 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ (Short list) చేస్తారు.

  APPSC Recruitment 2021 : ఏపీపీఎస్సీలో నాన్ గెజిటెడ్‌ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం


  Step 3 :  షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్ (Counseling) నిర్వ‌హించి పోస్టింగ్ ఇస్తారు.


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా నిర్వ‌హిస్తారు.

  Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://yadadri.telangana.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

  Step 3 :  వెబ్‌సైట్‌లో Notices ఆప్ష‌న్‌లో  Recruitment కి వెళ్లి నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4 :  నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.

  Step 5 :  అభ్య‌ర్థి విద్యార్హ‌త‌లు.. అనుభ‌వం (Experience) అన్ని న‌మోదు చేసి అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల జిరాక్స్‌ల‌ను పొందుప‌ర‌చ్చాలి.

  Step 6 :  అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్లు..

  - ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ స‌ర్టిఫికెట్లు

  - ఎంబీబీఎస్ స‌ర్టిఫికెట్లు

  - తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌ (Telangana Medical Council) లో రిజిస్ట‌ర్ స‌ర్టిఫికెట్

  - పాస్ పోర్టు ఫోటోగ్రాఫ్ , ఈడ‌బ్ల్యూఎస్ (EWS) వాళ్లు స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాలి.

  Step 7 :  ద‌ర‌ఖాస్తుల‌ను డీఎంహెచ్ఓ, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా, తెలంగాణ‌కు పంపాలి.

  Step 8 :   ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 21, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2021, Health department jobs, Job notification, JOBS, Telangana

  ఉత్తమ కథలు