హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Telangana: వ‌రంగ‌ల్ రీజియ‌న్ ప‌రిధిలో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

Jobs In Telangana: వ‌రంగ‌ల్ రీజియ‌న్ ప‌రిధిలో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాలు

చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాలు

తెలంగాణ(Telangana) డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగ‌న్‌వాడీ ఎక్సెటెన్ష‌న్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

    తెలంగాణ(Telangana) డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగ‌న్‌వాడీ ఎక్సెటెన్ష‌న్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులు వ‌రంగ‌ల్‌ (Warangal) జిల్లాలో పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా 275 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, కో ఆర్డినేట‌ర్లు (Co-Ordinaters), ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, కాంట్రాక్టు సూప‌ర్ వైజ‌ర్ (Supervisors)  కూడా వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హుల‌ని తెలిపారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ న‌వంబ‌ర్‌ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in/ ను సంద‌ర్శించాలి.

    జోన్ల వారీగా ఖాళీల వివ‌రాలు..

    జోన్ఖాళీల సంఖ్య‌
    కాళేశ్వ‌రం56
    బాస‌ర‌68
    రాజ‌న్న‌72
    భ‌ద్రాది79
    మొత్తం275


    Railway Apprentice: రైల్వేలో 1785 అప్రెంటీస్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం


    అర్హతలు..

    - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థి వ‌య‌సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

    - విద్యార్హత ప‌దోత‌ర‌గ‌తి పాసవ్వాలి.

    - అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, కో ఆర్డినేట‌ర్లు (Co-Ordinaters), ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, కాంట్రాక్టు సూప‌ర్ వైజ‌ర్ (Supervisors) కూడా వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.

    CSIR-CECRI Recruitment : సీఎస్ఐఆర్‌లో 54 ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు.. ఎంపిక విధానం


    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step-1 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tswdcw.in/ ను సంద‌ర్శించాలి.

    Step-2 : అక్క‌డ Detailed Notification క్లిక్ చేసి నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step-3 : అనంత‌రం Apply Online ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

    Step-4 : అనంత‌రం Click here to pay Amount ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

    Step-5 : ఫీజు చెల్లింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలి. ద‌ర‌ఖాస్తు రుసం రూ.200 ఉంటుంది.

    WhatsApp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు.. అవేంటి? ఎలా పనిచేస్తాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?


    Step-6 : అనంత‌రం చెల్లింపు పూర్తయిన త‌రువాత Click Here if amount paid already ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

    Step-7 : అనంత‌రం అప్లికేష‌న్ ఫాంను త‌ప్పులు లేకుండా పూర్తి చేయాలి.

    Step-8 : స‌బ్‌మిట్ చేసిన అనంత‌రం ర‌సీదు వ‌స్తుంది. దాన్ని భ‌ద్ర ప‌రుచుకోవాలి.

    Step-9 : ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS, Jobs in telangana

    ఉత్తమ కథలు