హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సింగరేణి లో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4వ తేదీ నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ హెచ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  సింగరేణి (Singareni) లో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4వ తేదీ నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ హెచ్ (JNTUH) డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను www.scclmines.com వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సింగరేణి లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షను తెలంగాణలోని 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో అత్యంత పకడ్బందీగా నిర్వహించమన్నారు. ఈ పరీక్షకు (Exam) మొత్తం 98,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 77898 మంది రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ఈ సారి నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. ఇందులో 49328 మంది అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు సాధించారని, 28570 మంది పరీక్షలో క్వాలిఫై కాలేదని విజయ్ కుమార్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు.

  గత ఆదివారం రాత పరీక్ష జరిగిన వెంటనే సోమవారం ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్ సైట్ లో నాలుగు ప్రశ్న పత్రాలకు సంబంధించిన కీ ని కూడా అందుబాటులో ఉంచామన్నారు. 48 గంటల సమయం ఇచ్చి అభ్యర్థుల నుంచి సూచనలను / అభ్యంతరాలను స్వీకరించినట్లు వారు తెలిపారు. ఆన్ లైన్ లో ఆధారాలతో వచ్చిన సూచనలను సంబంధిత సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ కు పంపించినట్లు వెల్లడించారు. వీటిని జేఎన్టీయూ హెచ్ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలించిందన్నారు.

  MLHP Posts In Telangana: 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

  పరిశీలన అనంతరం మూడు ప్రశ్నలకు సంబంధించి సరైన సమాధానం నాలుగు అప్షన్లలో లేదన్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకటికి రెండుసార్లు ఓఎంఆర్ షీట్ల ను అత్యంత పకడ్బందీగా చెక్ చేశామన్నారు. అనంతరం రాత పరీక్ష లో మెరిట్ సాధించిన వారి వివరాలను విడుదల చేసినట్లు వివరించారు.

  వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా: డైరెక్టర్ (పర్సనల్) శ్రీ ఎస్. చంద్రశేఖర్

  సింగరేణి రాత పరీక్షకు సంబంధించి అర్హత సాధించిన వారి రిజర్వేషన్, స్థానికత, మార్కులు తదితర అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను కంపెనీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ (పర్సనల్) శ్రీ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JNTUH, JOBS, Singareni Collieries Company, Telangana government jobs

  ఉత్తమ కథలు