news18-telugu
Updated: March 5, 2020, 6:23 PM IST
Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్ కేడర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 42 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు సింగరేణి సంస్థ అధికారిక వెబ్సైట్ https://scclmines.com లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 14 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://scclmines.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి Careers సెక్షన్లో Recruitment పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి.
Singareni Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 42
మేనేజ్మెంట్ ట్రైనీ (F&A)- 20
మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్)- 18
మేనేజ్మెంట్ ట్రైనీ (లీగల్)- 4
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 4దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 14 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- మేనేజ్మెంట్ ట్రైనీ (F&A) పోస్టుకు సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ. పర్సనల్ పోస్టుకు రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా హెచ్ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ లేదా హెచ్ఆర్ స్పెషలైజేషన్‌తో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లీగల్ పోస్టుకు న్యాయశాస్త్రంలో 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 2020 మార్చి 1 నాటికి 30 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.200.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వేలో 2792 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
LIC Jobs 2020: ఎల్ఐసీలో 218 జాబ్స్... మార్చి 15 చివరి తేదీ
SSC Recruitment 2020: మొత్తం 1157 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత
Published by:
Santhosh Kumar S
First published:
March 5, 2020, 6:23 PM IST