Telangana Jobs: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...

జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడానికి వైద్యాధికారులు, హెల్ప్ డెస్క్ కౌన్సిలర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైద్యాధికారులు 53 పోస్టులకు గానూ వేతనం రూ. 20వేలు, హెల్ప్‌డెస్క్ కౌన్సిలర్ మూడు పోస్టులకుగానూ వేతనం రూ. 10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: October 12, 2019, 10:36 PM IST
Telangana Jobs: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 10:36 PM IST
హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడానికి వైద్యాధికారులు, హెల్ప్ డెస్క్ కౌన్సిలర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైద్యాధికారులు 53 పోస్టులకు గానూ వేతనం రూ. 20వేలు, హెల్ప్‌డెస్క్ కౌన్సిలర్ మూడు పోస్టులకుగానూ వేతనం రూ. 10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా వైద్యాధికారులకు ఈనెల 15న, కౌన్సిలర్‌ పోస్టులకు ఈనెల 17న సెలక్ట్ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దరఖాస్తులు కోసం ఇతర వివరాలు https://hyderabad.telangana.gov.in/notice_category/recruitment/ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తుతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్లు జీరాక్స్ ప్రతులను జతపరిచి, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాక్ ఇన్ ఇంటర్వూకు హాజరు కావాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి పేర్కొన్నారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...