Home /News /jobs /

TELANGANA JOBS RANGAREDDY DMHO RELEASED NOTIFICATION FOR MEDICAL OFFICERS KNOW APPLICATION PROCESS EVK

Telangana Jobs 2021 : రంగారెడ్డి జిల్లాలో మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

రంగారెడ్డి జిల్లా జాబ్స్‌

రంగారెడ్డి జిల్లా జాబ్స్‌

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (District Medical and Health Officer) కార్యాల‌యంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 93 మెడిక‌ల్ ఆఫీస‌ర్ (Medical Officers) ఖాళీల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (District Medical and Health Officer) కార్యాల‌యంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 93 మెడిక‌ల్ ఆఫీస‌ర్ (Medical Officers) ఖాళీల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌ (Offline) లోనే ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు పోస్టుల ఆధారంగా వేరుగా ఉంది. ఎటువంటి రాత ప‌రీక్ష (Written test) లేకుండా కేవ‌లం అకాడ‌మిక్ మెరిట్‌ (Academic Merit) ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 10, 2021 వ‌ర‌కు ఉంది. ద‌ర‌ఖాస్తుకు సంబంధించిన వివ‌రాలు, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://rangareddy.telangana.gov.in/ ను సంద‌ర్శించాలి.

    ముఖ్య స‌మాచారం..



































    పోస్టుమెడిక‌ల్ ఆఫీస‌ర్
    పోస్టుల సంఖ్య 93
    అర్హ‌తఎంబీబీఎస్ చేసి ఉండాలి. తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట్ర‌ర్ అయి ఉండాలి.
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 12, 2021
    ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌నఅక్టోబ‌ర్ 13, 2021 నుంచి అక్టోబ‌ర్ 20, 2021 వ‌ర‌కు
    మెరిట్ లిస్ట్ ప్ర‌క‌ట‌న (అభ్యంత‌రాల‌కు అవ‌కాశం)అక్టోబ‌ర్ 21, 2021 నుంచి అక్టోబ‌ర్ 25, 2021 వ‌ర‌కు
    తుది మెరిట్ లిస్ట్అక్టోబ‌ర్ 26, 2021
    కౌన్సెలింగ్ తేదీఅక్టోబ‌ర్ 27, 2021

    TCS iON : గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్‌.. టీసీఎస్ ఐఓన్ 15 రోజుల ఉచిత కోర్సు


    ఎంపిక విధానం..

    Step 1 :  ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా ఎంపిక విధానం ఉంటుంది.

    Step 2 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ (Short list) చేస్తారు.

    Step 3 :  షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించి పోస్టింగ్ ఇస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా నిర్వ‌హిస్తారు.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rangareddy.telangana.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3 :  వెబ్‌సైట్‌లో NOTIFICATIONS ఆప్ష‌న్‌లోకి వెళ్లి నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 :  నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.

    Step 5 :  అభ్య‌ర్థి విద్యార్హ‌త‌లు.. అనుభ‌వం (Experience) అన్ని న‌మోదు చేసి అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల జిరాక్స్‌ల‌ను పొందుప‌ర‌చ్చాలి.

    Step 6 :  అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్లు..
    - ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ స‌ర్టిఫికెట్లు
    - ఎంబీబీఎస్ స‌ర్టిఫికెట్లు
    - తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌ (Telangana Medical Council) లో రిజిస్ట‌ర్ స‌ర్టిఫికెట్
    - పాస్ పోర్టు ఫోటోగ్రాఫ్ , ఈడ‌బ్ల్యూఎస్ (EWS) వాళ్లు స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాలి.

    Step 7 :  ద‌ర‌ఖాస్తుల‌ను డీఎంహెచ్ఓ, రంగారెడ్డి, తెలంగాణ‌కు పంపాలి.

    Step 8 :   ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Health department, Health department jobs, Job notification, Rangareddy, Telangana, Telangana health department

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు