Home /News /jobs /

TELANGANA JOBS PRIVATE COMPANIES TO ORGANISE JOB MELA AT GADWAL ON MARCH 6 SS

Job Mela: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా... ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు

Job Mela: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా... ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Job Mela: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా... ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs | తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మార్చి 6న గద్వాలలో జాబ్ మేళా జరగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    తెలంగాణలో జాబ్ మేళాలు కొనసాగుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో అనేక మంది ఉద్యోగాలను పొందుతున్నారు. ప్రైవేట్ కంపెనీలు వరుసగా ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఆయా జిల్లాల ఉపాధి కల్పన శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో మార్చి 6న జాబ్ మేళా జరగనుంది. స్థానిక యువతతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. గద్వాలలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో హైదరాబాద్, కర్నూలు ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు పాల్గొననున్నాయని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ప్రియాంక తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసినవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. జాబ్ మేళాలో పాల్గొనే 6 కంపెనీలు అభ్యర్థుల దరఖాస్తుల్ని పరిశీలించి తమ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని ఎంపిక చేయనుంది.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    LIC Jobs 2020: ఎల్ఐసీలో 218 జాబ్స్... మార్చి 15 చివరి తేదీ

    SSC Recruitment 2020: మొత్తం 1157 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత

    MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 104 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Gadwal, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు