హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

Telangana Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ(Telangana)లోని రంగారెడ్డి జిల్లా(Rangareddy District) వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. ఖాళీలు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ (Telangana)లో మరో ఉద్యోగాల(Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Job Notification) విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను(Job Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఈ నెల 30న ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 2న ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..


పోస్టుఖాళీలువేతనం
ల్యాబ్ మేనేజర్5రూ.30,000
రేడియోగ్రాఫర్5రూ. 21,000
డేటా ఎంట్రీ ఆపరేటర్5రూ.11,500


విద్యార్హతల వివరాలు..

1.ల్యాబ్ మేనేజర్: MBA(Health Care)/గ్రాడ్యేయేట్(హెల్త్ కేర్ విభాగంలో రెండేళ్ల అనుభవం) అర్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

2.రేడియోగ్రాఫర్లు: డిప్లొమా/బీఎస్సీ(రేడియోగ్రఫీ)/DMLT(Diploma in Medical Imaging Technology) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు.

3.డేటా ఎంట్రీ ఆపరేటర్: డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

NPCIL Recruitment 2021: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 250 ఉద్యోగాలు.. కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక.. వివరాలివే

వయో పరిమితి: పై అన్ని విభాగంలోని ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-34 ఏళ్లు ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక ఇలా..

మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

University of Hyderabadలో ఉద్యోగాలు.. రూ.2.18 లక్షల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి


ఎలా అప్లై చేయాలి:

-అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేయాలి.

-అనంతరం అప్లికేషన్ ఫామ్ ను నింపి రంగారెడ్డి జిల్లా DM&HO కార్యాలయంలో అందించాలి.

Jobs In AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

-అప్లికేషన్ ఫామ్ కు టెన్త్, ఇంటర్, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలు, కంప్యూటర్ నాలెడ్జ్ కు సంబంధించిన సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

-అభ్యర్థులు సర్టిఫికేట్ల కాపీలను నవంబర్ 2వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది.

-ఇతర పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

First published:

Tags: CAREER, Job notification, JOBS, Jobs in telangana, Rangareddy, State Government Jobs, Telangana

ఉత్తమ కథలు