హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. మీ జిల్లా ఏ జోన్‌ కిందికి వస్తుంది?

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. మీ జిల్లా ఏ జోన్‌ కిందికి వస్తుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Jobs: ఉద్యోగార్థుల వయోపరిమితిపైనా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలిస్‌ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని నిర్ణయించింది.

  తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. 80,039 పోస్టులకు నేటి నుంచే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. ఈ ఖాళీలన్నింటికీ 95 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లలో 95% రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కలిగి ఉంటారు. ఇతర జిల్లాలు , జోన్లు, మల్టీ జోన్‌లలో 5% ఓపెన్‌ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. ఐతే ఏ జిల్లా ఏ జోన్, ఏ మల్టీజోన్ కిందకు వస్తుందన్న వివరాలు చాలా మందికి తెలియదు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలను రెండు మల్టీజోన్‌లుగా, ఏడు జోన్లుగా విభజించారు. జోన్1ని కాళేశ్వరంగా, జోన్2ని బాసరగా, జోన్3-రాజన్న, జోన్4- భద్రాద్రి, జోన్5-యాదాద్రి, జోన్6- చార్మినార్, జోన్7ని జోగులాంబగా పిలుస్తున్నారు. మల్టీ జోన్-1 పరధిలో ఐదు జోన్లు (జోన్-1 నుంచి జోన్-5) వరకు ఉన్నాయి. మల్టీ జోన్-2 పరిధిలో రెండు జోన్లు (జోన్-6, జోన్-7) ఉన్నాయి.


  జోన్1 (కాళేశ్వరం) కిందకు వచ్చే జిల్లాలు:

  కొమ్రం భీమ్ అసిఫాబాద్‌

  మంచిర్యాల

  పెద్దపల్లి

  జయశంకర్‌ -భూపాలపల్లి

  ములుగు

  జోన్‌ 2 (బాసర) కిందకు వచ్చే జిల్లాలు:

  ఆదిలాబాద్‌

  నిర్మల్‌

  నిజామాబాద్‌

  జగిత్యాల జిల్లా

  జోన్‌3 ( రాజన్న) కిందకు వచ్చే జిల్లాలు

  కరీంనగర్‌

  రాజన్న సిరిసిల్లా

  సిద్దిపేట

  మెదక్‌

  కామారెడ్డి


  జోన్‌ 4( భద్రాద్రి) కిందకు వచ్చే జిల్లాలు

  భద్రాద్రి కొత్తగూడెం

  ఖమ్మం

  మహబూబాబాద్‌

  వరంగల్‌ రూరల్‌

  హన్మకొండ

  జోన్‌5 (యాదాద్రి) కిందకు వచ్చే జిల్లాలు

  సూర్యాపేట

  నల్లగొ ౦డ

  యాదాద్రి భువనగిరి

  జనగాం

  జోన్‌ 6 ( చార్మినార్‌) కిందకు వచ్చే జిల్లాలు

  మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి

  హైదరాబాద్‌

  రంగారెడి

  సంగారెడ్డి

  వికారాబాద్‌ జిల్లా

  జోన్‌ 7 (జోగులాంబ) జోన్  కిందకు వచ్చే జిల్లాలు

  మహబూబ్‌నగర్

  నారాయణ్‌ పేట

  జోగుళాంబ-గద్వాల

  వనపర్తి

  నాగర్ కర్నూల్


  కాగా,  ఐతే ఈ అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫిషన్లు రావు. ఇవాళ్టి నుంచి నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం

  నిర్ణయించింది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి , ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌‌ను ప్రకటిస్తారు. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్దం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి.

  Telangana Jobs: 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఒకేసారి వస్తాయా? రిజర్వేషన్ రూల్స్ ఏంటీ?

  మరోవైపు ఉద్యోగార్థుల వయోపరిమితిపైనా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలిస్‌ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల మరింత మంది  అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. తాజా ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Job notification, Telangana, Telangana jobs

  ఉత్తమ కథలు