Telangana Jobs: ఇంటర్ పాసైనవారికి సంగారెడ్డిలో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Telangana Jobs: ఇంటర్ పాసైనవారికి సంగారెడ్డిలో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ప్రతీకాత్మక చిత్రం)

IAF Recruitment Rally 2020 | పూర్తి వివరాల కోసం https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్ చూడండి. ఈ ర్యాలీకి సుమారు 10,000 మంది వస్తారని అంచనా. ఎంపికైన వారికి 6 నెలల నుంచి ఏడాది శిక్షణ ఉంటుంది.

  • Share this:
    ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబోతోంది. ఈ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్ గ్రూప్ వై-నాన్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. పెళ్లికాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ పోలీస్, ఆటోమొబైల్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది ఐఏఎఫ్. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్ చూడండి. ఈ ర్యాలీకి సుమారు 10,000 మంది వస్తారని అంచనా. ఎంపికైన వారికి 6 నెలల నుంచి ఏడాది శిక్షణ ఉంటుంది. మరోవైపు ఎయిర్‌మెన్ పోస్టులకు కూడా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    IAF Recruitment Rally 2020: ఐఏఎఫ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ వివరాలివే...


    భర్తీ చేసే పోస్టులు- ఎయిర్‌మెన్ గ్రూప్ వై-నాన్ టెక్నికల్
    విద్యార్హత- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో ఇంటర్ రెండు సంవత్సరాల్లో 50 శాతం మార్కులు ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పోలీస్ ఉద్యోగానికి 175 సెంటీమీటర్ల ఎత్తు, ఆటో టెక్నీషియన్‌కు 165 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
    ఎంపిక విధానం- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2
    వయస్సు- 2000 జనవరి 19 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారే దరఖాస్తు చేయాలి
    వేతనం- శిక్షణ కాలంలో స్టైపెండ్. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.21,700 వేతనం.
    ర్యాలీ జరిగే తేదీ- 2020 జనవరి 16 నుంచి జనవరి 21 వరకు
    ర్యాలీ నిర్వహించే ప్రదేశం- జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సుల్తాన్ పూర్, సంగారెడ్డి.

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఇతర పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    VIDEO: రైలు ఫుట్ బోర్డ్‌పై విన్యాసం... చివరికి ఏం జరిగిందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    RBI Recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఆర్‌బీఐలో 926 అసిస్టెంట్ జాబ్స్... హైదరాబాద్‌లో పోస్టులు

    BECIL Recruitment 2020: గుడ్ న్యూస్... 4,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్

    Khadi Village Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో 108 జాబ్స్... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published: