హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CM KCR: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

CM KCR: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana cm kcr big announcement on jobs: తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

ఇంకా చదవండి ...

అందరూ ఊహించినట్లుగానే.. తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పారు.  ఉద్యోగాలపై అసెంబ్లీలో బుధవారం కీలక ప్రకటన చేస్తానని నిన్న వనపర్తి సభలో చెప్పడంతో.. ఇవాళ్టి ఉదయం నుంచే ఎంతో మంది యువత టీవీలకు అతుక్కుపోయారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రసంగం ప్రారంభించిన సీఎం కేసీఆర్... ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు  ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో 10 పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్.

95 శాతం ఉద్యోగాలు స్థానికులే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని.. దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల వివాదం పరిష్కారమైతే.. అక్కడ కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. మరో 10 నుంచి 20వేల ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

ఉమ్మడి రాష్ట్రంలో యువత నలిగిపోయింది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగావకాశలు లేవని యువత నిరాశలో ఉన్నారు. తుపాకులు పట్టుకొని తీవ్రవాదులు అయ్యారు. రైతులను పాతాళానికి తొక్కేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచారు. వారి కష్టాలను చూడలేకే..టీఆర్ఎస్ పార్టీని స్థాపించాం. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం సాకారమైంది. తెలంగాణ కోసం విద్యార్థులు, యువత చేసిన పోరాటం మరవలేనిది.

రాజకీయాలంటే ఇతర పార్టీలకు గేమ్. కానీ టీఆర్ఎస్‌కు ఒక టాస్క్.  పవిత్రమైన కర్తవ్యం. ఏది తీసకున్నా తీసిరయస్‌తా తీసుకంటా. మేం రాష్ట్రాన్ని తెచ్చిన వారు. ఈ రోజు మాట్లాడేవారు ఆ రోజు ఎక్కడున్నారో ప్రజలకు తెలుసు. అసెంబ్లీలో ఎంతో కొట్లాడం. సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఏం చేసినా ప్రజల కోసమే చేస్తాం. ఇప్పటికే ఎన్నో పథకాలు కొచ్చి విజయవంతమయ్యాం.

నీళ్లు, నిధుల, నియామకాల కోసం తెలంగాణ  ప్రజలు పోరాటం చేశారు. భాషకుకూడా ప్రాధాన్యం దక్కింది. ఇప్పుడు సినిమాల్లో హీరో తెలంగాణ యాస మాట్లాడితే అది సూపర్ హిట్ అవుతోంది. గతంలో జోకర్ భాషగా చూసేవారు. స్వరాష్ట్రంలో మన పండగలను ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే నీళ్లల్లో కూడా వాటా తెచ్చుకున్నాం. ఇంకా రావాల్సి ఉంది. దాని కోసం కొట్టాడతాం.

మే నెలలో కూడా జలాశయాలను నింపుతున్నాం. తెలంగాణలో ఇప్పుడు కొత్త డిమాండ్ వస్తోంది. వాగుల్లో నీరు వదలాలని ప్రజలు కోరుతున్నారు. వారు కోరినట్లుగానే నీటిని విడుదల చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో పెద్ద మొత్తంలో ధాన్యం ఉత్తత్తి అవుతోంది.ధాన్యం సేకరణకే మూడు నెలల సమయం పడుతోంది. కరెంటు గోస కూడా తీరింది.

విద్యుత్ ఉద్యోగులు, 9, 10వ షెడ్యూల్ సంస్థల పంచాయతీ ఇంకా తెగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరహిత పంచాయతీలను ఎన్నో పెడుతున్నారు. టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిలోనూ వాటా కావాలని కోరుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా సక్రమంగా చేయలేదు.

లక్షా 55 వేల పోస్టులను నోటిఫి చేశాం. లక్షా 30 వేలు భర్తీ అయ్యాయి. 22వేల ఉద్యోగాలకు ప్రాసెస్ జరుగుతుంది. ఏపీ వారితో పంచాయతీ రాకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపించాం. కానీ చాలాకాలం పెండింగ్‌లో పెట్టారు. వెంటపడిమరీ చేయించుకున్నాం.


ఎవరి ఉద్యోగాలు వారికే వచ్చేలా 95శాతం కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చాం. అది మా చిత్తశుద్ధి. అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టులు 95 శాతం స్థానికులకే వస్తాయి. 5శాతం మాత్రమే ఓపెన్ కోటాలోకి వెళ్తాయి. అందులోనూ కొన్ని పోస్టులు జనరల్ కింద స్థానికులకే దక్కుతాయి.

First published:

Tags: CM KCR, Govt Jobs 2022, Telangana, Telangana jobs

ఉత్తమ కథలు